UPDATES  

NEWS

 ఏం పీకలేరు బ్రదర్ అంటున్న అల్లు ఆర్మీ..!

సాధారణంగా ఫ్యాన్ వార్స్ చూస్తూనే ఉంటాం. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని కొట్టుకుంటూ ఉంటారు. కానీ, అదే ఫ్యాన్స్ కొన్నిసార్లు తమ హీరో చేసింది తప్పు అయితే తప్పే అని చెప్పుకొస్తారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అదే చేస్తున్నారు. కొంతమంది బన్నీకి సపోర్ట్ చేస్తుండగా.. కొంతమంది అతను చేసింది తప్పే అని చెప్పుకొస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం వలనే మనిషి గొప్పవాడు అవుతాడు అని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ, బన్నీ ఇప్పుడు చేసింది అందుకు విరుద్ధంగా ఉందని చెప్పుకొస్తున్నారు.

 

మొదటి నుంచి మెగా ఫ్యామిలీ నుంచి బయటకి వచ్చి తనంతట తానుగా అల్లు ఫ్యామిలీని.. మెగా ఫ్యామిలీ అంత గొప్పగా చేయాలనీ బన్నీ ప్రయత్నిస్తూ ఉన్నాడు. అందులో చాలావరకు సక్సెస్ కూడా అయ్యాడు. మెగా కుటుంబం నుంచి వచ్చినా కూడా తన నటనతో.. డ్యాన్స్ తో ప్రేక్షకులను మెప్పించి ఐకాన్ స్టార్ గా మారాడు. అయినా కూడా ఇంకా ఏదో కావాలనే తపన బన్నీలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు పుష్ప 2 తో గ్లోబల్ స్థాయికి మారాలని చూస్తున్నాడు.

 

ఎప్పటినుంచో #అల్లు – #మెగా మధ్య ఈ పోరాటం నడుస్తోంది. కానీ, ఎవరు బయటపడలేదు. మెగా ఇంట్లో ఫంక్షన్స్ కు బన్నీ కావాలని డుమ్మా కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. స్టైలిష్ స్టార్ గా మారి.. తనకంటూ ఒక స్థానాన్ని తెచ్చుకున్నప్పుడే చెప్పను బ్రదర్ అని చెప్పి మెగా కుటుంబానికి ఇన్ డైరెక్ట్ గా తాను ఎదిగాను అని చెప్పేశాడు. అప్పటినుంచి ఫ్యాన్స్ లో కొంత అలజడి నెలకొంది. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే.. బన్నీ ఫ్యాన్స్ లో చాలామంది మెగా అభిమానులే.

 

మొదటినుంచి కూడా అతనికి సపోర్ట్ గా నిలబడింది కూడా మెగా అభిమానులే. అంతేనా పవన్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సపోర్ట్ గా నిలబడ్డాడు. ఆయన ప్రచారాలకు వచ్చాడు. పవన్ కుటుంబాన్ని నానా మాటలు అన్నప్పుడు కూడా బన్నీ, పవన్ పక్కనే ఉన్నాడు. ఇంత చేసిన బన్నీ.. ఈసారి చేసిన ఒక చిన్న తప్పు అతనిని అందరూ విమర్శించేలా చేస్తుంది. అవన్నీ చిన్న చిన్నవే కాబట్టి ఎవరు అంతగా పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు అలా కాదు. సొంత కుటుంబాన్ని వదిలి.. భార్య కు తెల్సిన ఫ్రెండ్ కోసం వేరే పార్టీకి ప్రచారం చేశాడు. వైసీపీ నేత ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు చెప్పి వచ్చాడు. అప్పటివరకు మెగా- అల్లు కుటుంబం ఒకటే అని అనుకున్న వారిలో చీలికలు మొదలయ్యాయి.

 

సరే అయపోయింది ఏదో అయిపోయింది అని కాకుండా పవన్ గెలిచాక కూడా అల్లు కుటుంబం.. మెగా కుటుంబంలో ఎక్కడా కనిపించలేదు. ట్వీట్ పెట్టడమే కానీ, పవన్ ను కలిసింది లేదు. భార్య స్నేహితుడు అని, మాట ఇచ్చాను అని వెళ్లి ప్రచారం చేసావే.. సొంత కుటుంబ సభ్యుడు పదేళ్లు నరకం చూసి మొదటిసారి విజయాన్ని అందుకున్నాడు. ఆయనకు శుభాకాంక్షలు చెప్పడానికి సమయం లేదా అని మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు.. ఫ్రెండ్ అని వెళ్లడం నీ వరకు మంచిదే. కుటుంబాన్ని వదిలి మరీ వెళ్ళావ్.. అప్పుడు బయటివారికి నువ్వెలా కనిపిస్తావు అని అడుగుతున్నారు.

 

చిరంజీవి.. జగన్ చేతులు పట్టుకొని బతిమిలాడినప్పుడు.. అదే వైసీపీ నేతను కలిసి జగన్ తో ఎందుకు మాట్లాడలేకపోయావ్. పుష్ప సినిమాకు టికెట్ రేట్లు పెంచాలి అన్ని అడిగేటప్పుడు ఎందుకు ఆ వైసీపీ నేత గుర్తుకు రాలేదు.. సడెన్ గా ఎన్నికల ప్రచారానికి.. అది కూడా ఒక్కరోజు ముందు మాత్రమే వైసీపీ నేతను కలిసి ప్రచారం చేయాల్సిన అవసరం ఏంటి.. ? ఎవరికి వ్యతిరేకంగా ఉన్నావని నిరూపించడానికి అని ప్రశ్నిస్తున్నారు.

 

ఇవన్నీ బన్నీ దగ్గర సమాధానాలు లేని ప్రశ్నలు. తప్పు చేసినా కొంతమంది డై హార్ట్ ఫ్యాన్స్ .. బన్నీకి సపోర్ట్ గా ఉండడం విశేషం. మెగా కుటుంబం మొత్తం వచ్చి మీద పడినా.. అల్లు అర్జున్ ఏం పీకలేరు అని దైర్యంగా సపోర్ట్ ఇస్తున్నారు. ఎవరు ఎన్ని అనుకున్నా పుష్ప 2 తో వస్తాం.. హిట్ కొడతాం అని చెప్పుకొస్తున్నారు. ఒక్కడే ఎదిగాడు.. ఒక్కడే నిలబడతాడు అని ఫ్యాన్స్ కలర్ ఎగరవేసి మరీ చెప్తున్నారు. మరి.. పుష్ప 2 కోసం బన్నీ.. దిగివచ్చి అదే పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లడా.. ? ఇప్పుడు ఈ నెగెటివిటీ రేపు నీ సినిమాపై ప్రభావం చూపించదా.. ? ఒకవేళ అదే కనుక జరిగితే బన్నీ పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే అని కొందరు అంటున్నారు.

 

ఇక ఈ వివాదంపై మెగా హీరోలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. నాగబాబు అనవసరంగా ముందే ట్వీట్ పెట్టి అందరి ముందు దోషిగా మారాడు. నిన్నటికి నిన్న సాయి ధరమ్ తేజ్.. బన్నీ దంపతులను అన్ ఫాలో చేసి.. బన్నీ ఫ్యాన్స్ ట్రోల్స్ కు గురయ్యాడు. మరి ముందు ముందు ఈ మెగా- అల్లు మధ్య వార్ ఎలా ఉండబోతుందో చూడాలి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |