UPDATES  

NEWS

 వాష్‌రూమ్‌ల్లో షవర్లు రిపేర్‌ చేస్తుంటే బయటపడిన హిడెన్ కెమెరాలు..!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో హిడెన్ కెమెరాల బాగోతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీ గర్ల్స్‌ హాస్టల్‌లో హిడెన్‌ కెమెరా ఘటనపై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. వైయస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రెస్‌మీట్‌ నిర్వహించి ఏపీ ప్రభుత్వ అసమర్థ పాలన అంటూ ఫైర్ అయ్యారు.

 

హిడెన్ కెమెరాలపై ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు: వైసీపీ ఎమ్మెల్సీ

రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యా రంగం అస్తవ్యస్తం అయిందన్న వైసీపీ ఎమ్మెల్సీ , ఎక్కడికక్కడ పర్యవేక్షణ కొరవడిందని, దీంతో పిల్లలు చాలా కష్టాలు పడుతున్నారని చెప్పారు. ఇంజనీరింగ్‌ కాలేజ్‌ గర్ల్స్‌ హాస్టల్‌లో ఘటన అనైతికం అన్న ఆమె, వాష్‌రూమ్‌ల్లో హిడెన్‌ కెమెరాలపై విద్యార్థినిలు ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఘటన వెలుగులోకి వచ్చినా, ప్రభుత్వం ఏ మాత్రం సక్రమంగా స్పందించడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

 

కాలేజీ యాజమాన్యాన్ని రక్షించే పనిలో ప్రభుత్వం

అసలు అలాంటిదేమీ లేదంటూ కితాబునివ్వడం అత్యంత హేయమని వరుదు కళ్యాణి ఆక్షేపించారు. హిడెన్‌ కెమెరాలపై విద్యార్థినిలు ఆందోళన చేస్తున్నా, ప్రభుత్వం తొలి నుంచి, వారిని కట్టడి చేస్తూ కాలేజీ యాజమాన్యాన్ని రక్షించే ప్రయత్నం చేస్తోందని వరుదు కళ్యాణి మండిపడ్డారు. గత 29వ తేదీన హాస్టల్‌ వాష్‌రూమ్‌ల్లో షవర్లు రిపేర్‌ చేస్తుంటే, హిడెన్‌ కెమెరాలు బయట పడ్డాయని కళ్యాణి పేర్కొన్నారు.

 

బలవంతంగా విద్యార్థినులను ఇళ్ళకు పంపటం దేనికి

హిడెన్ కెమెరాలపై ఫిర్యాదు అందినా, ఏ మాత్రం దర్యాప్తు చేయని పోలీసులు, అక్కడ అలాంటిదేమీ లేదని 30వ తేదీన ప్రకటించారని ఆమె గుర్తు చేశారు. నిజానికి ఈ వ్యవహారంలో విద్యార్థినుల సమక్షంలో విచారణ జరగాల్సి ఉండగా, వారందరినీ బలవంతంగా ఇళ్లకు పంపించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు తమను కూడా హాస్టల్‌లోకి అనుమతించక పోవడాన్ని వరుదు కళ్యాణి తప్పు బట్టారు.

 

ఘటనకు కారణమైన విద్యార్ధి పవన్ ఫ్యాన్ .. కానీ వైసీపీ అని నెట్టే యత్నం

ప్రభుత్వ వైఖరిని నిలదీసిన ఆమె, ఇకనైనా ఇలాంటి సంఘటలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఈ మొత్తం ఘటనకు కారణమైన విద్యార్ది యొక్క సోషల్‌ మీడియా అకౌంట్లో పవన్‌ కళ్యాన్‌ ఫోటోలు ఉంటే, వాటిని మార్ఫింగ్‌ చేసి తమ పార్టీపై నెట్టే ప్రయత్నం చేశారని వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విద్యార్థినిలకు న్యాయం జరిగే వరకు పోరాటం సాగిస్తామని వరుదు కళ్యాణి ప్రకటించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |