UPDATES  

NEWS

 సామర్లకోట బాణాసంచా కేంద్రంలో ఘోర ప్రమాదం: 23 మంది మృతి

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో శనివారం మధ్యాహ్నం భారీ విషాదం చోటుచేసుకుంది. స్థానిక సూర్య ఫైర్ వర్క్స్ బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ధాటికి ఇప్పటివరకు 23 మంది మృతదేహాలను వెలికితీశారు. పేలుడు తీవ్రత ఎంతలా ఉందంటే.. సుమారు 5 కిలోమీటర్ల మేర శబ్దాలు వినిపించాయని, సమీపంలోని ఇళ్లు, పాఠశాలలు కూడా దెబ్బతిన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద సమయంలో సుమారు 20 నుండి 30 మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నట్లు సమాచారం, దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయనగరం పర్యటనలో ఉన్న సీఎం, వెంటనే జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడిన వారికి మెరుగైన ఉచిత వైద్యం అందించాలని, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మంత్రులు కందుల దుర్గేష్, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌లను తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. బాణాసంచా యూనిట్లపై నిఘా ఉంచాలని, భద్రతా ప్రమాణాల తనిఖీలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులకు

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |