ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అనే పాట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పాడుకొనే సమయం ఆసన్నమైంది. ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తరువాత.. పవన్ ఇంకా సినిమా సెట్ లో అడుగుపెట్టిందే లేదు. ప్రస్తుతం పవన్ చేతిలో సినిమాలు ఉన్నాయి కాబట్టి.. వాటిని ఫినిష్ చేయడానికి అయినా వస్తాడు అనే నమ్మకం ఉంది. ఈ సినిమాలు రిలీజ్ అయ్యాయి అంటే.. ఇక పవన్ ను తెరపై చూడడం కష్టమే అని చెప్పాలి.
ఇక ఇవన్నీ పక్కన పెడితే.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూడు చిత్రాల్లో ఒకటి OG. కుర్ర డైరెక్టర్ సుజిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని DVV ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపిస్తున్నాడు. అన్ని బావుండి ఉంటే .. ఈ పాటికి OG ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉండేది. ముందుగా మేకర్స్ ఈ సినిమాను సెప్టెంబర్వ్ 27 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
మధ్యలో పవన్ రాజకీయ ప్రచారాలు, ఎన్నికలు, రిజల్ట్స్ అంటూ సినిమా ఆగుతూ వస్తుంది. ఇక దీంతో రిలీజ్ డేట్ ను చేంజ్ చేసిన విషయం తెల్సిందే. ఇక ఆ డేట్ ను దేవర అందుకున్నాడు. దీంతో ఎప్పుడెప్పుడు OG రిలీజ్ డేట్ వస్తుందో అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులు సమాధానం దొరకబోతుంది.
ఇకపోతే అందుతున్న సమాచారం ప్రకారం OG వేసవి కానుకగా రానున్నట్లు తెలుస్తోంది. మార్చి 27 న OG ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 2 .. పవన్ బర్త్ డే కానుకగా.. OG నుంచి కొత్త పోస్టర్ తో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారని సమాచారం. ఇక ఈ విషయం తెలియడంతో పర ఫ్యాన్స్ సంబురాలను కాస్తా ముందే మొదలుపెట్టేసారు. మరి ఈ సినిమాతో పవన్ – సుజీత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.