UPDATES  

NEWS

 ముంబై నటి వ్యవహారం.. సీఎం చంద్రబాబు రియాక్ట్, అదొక కామా పార్టీ అంటూ..

ఏపీలో ముంబై నటి వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారం రాజకీయ నేతల నుంచి అధికారుల వైపు టర్న్ అయ్యింది. దీనిపై కూటమి సర్కార్ దృష్టి సారించింది. రేపే మాపో సంబంధిత అధికారులకు నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు.

 

ముంబై నటి కాదంబరి వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ కేసులో అప్పటి అధికారులు ఎంతమంది ఉన్నారు? నటి ఫ్యామిలీని ముంబైకి తీసుకెళ్లిందెవరు? అన్నదానిపై పూర్తి డీటేల్స్ ప్రభుత్వం వద్దకు చేరాయి. ఏపీ అధికారులు నటి కుటుంబసభ్యులతో మాట్లాడినట్టు తెలుస్తోంది.

 

వారి నుంచి కీలక వివరాలు తీసుకున్నారు. ఈ రెండింటినీ కంపేర్ చేస్తున్నారు. దీని ఆధారంగా రేపోమాపో ఐపీఎస్ అధికారులకు నోటీసులు ఇవ్వాలని భావిస్తోంది. అలాగే గెస్ట్‌హౌస్ ఓనర్ నుంచి ఆధారాలు సేకరించినట్టు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వానికి అంతర్గత నివేదిక అందింది.

 

విజయవాడ సీపీ రాజశేఖరబాబు ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో నమోదైన కేసు గురించి ఆరా తీశారు. కేసు డైరీని పరిశీలించారు. ఆ తర్వాత సీఐడీ చీఫ్ రవిశంకర్ అక్కడికి వెళ్లారు. సీపీతో దాదాపు అరగంటపాటు సమావేశమయ్యారు. నటి నేరుగా వచ్చిన ఫిర్యాదు చేస్తే.. పోలీసు అధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.

 

బుధవారం సాయంత్రం మీడియాతో సీఎం చంద్రబాబు.. ముంబై నటి వ్యవహారంపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. రోజురోజుకూ దానిపై స్టోరీలు రావడం అసహ్యంగా ఉందన్నారు. రాజకీయాల్లో చిన్నది వస్తే స్కాండల్ ఒకప్పుడు ఊహించుకున్నామని గుర్తు చేశారు. మా పార్టీ నేతలు చిన్న తప్పు చేశారంటే సీరియస్‌గా తీసుకున్నానని, పిలిచి మాట్లాడతానని, కానీ గత ప్రభుత్వంలో ఇలాంటివి చాలా తేలిగ్గా తీసుకున్నారని చెప్పారు.

 

ఇన్ని విషయాలు బయటకు వస్తే ఎందుకు ఆ పార్టీ సైలెంట్‌గా ఉందని ప్రశ్నించారు ముఖ్యమంత్రి. ఇటీవల ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలపై అనేక ఆరోపణలు వస్తున్నాయని, ఈ విషయం లో మనం ఆదర్శమా? మొన్నటివరకు వీళ్లు చేసిన గంజాయ్ వ్యవహారం ఇంకా వెంటాడుతోందన్నారు.

 

ప్రతీదాన్ని సమర్థించుకోవడం వారికి అలవాటుగా మారిందన్నారు. ఇలాంటి వారితో పోరాటం చేయాల్సి రావడం సిగ్గుగా ఉందన్నారు. మనం మాట్లాడకపోతే ప్రజలు అర్థం చేసుకోలేరని, వైసీపీ పార్టీ ఇప్పుడు కామా పార్టీగా మారిందన్నారు.

 

ముంబై నటిని వేధించిన వ్యవహారంలో సూత్రధారిగా మారిన విద్యాసాగర్ ఎక్కడ? ఆయన జాడ ఏ మాత్రం తెలియలేదు. ఈయన విదేశాలకు వెళ్లిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. 2014లో వైసీపీ తరపున కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నుంచి పోటీ చేశారాయన. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు.

 

2017లో హైదరాబాద్‌లో ఓ వివాహానికి హాజరయ్యారు. అక్కడే ముంబై నటితో పరిచయం ఏర్పడింది. విద్యాసాగర్ కి మ్యారేజ్ అయిన కొద్దినెలలకే భార్య వెళ్లిపోయారు. నటికి నేరుగా తన న్యూడ్ ఫోటోలు పంపేవాడు. అంతేకాదు అసభ్యకరంగా మెసేజ్‌లు పెట్టేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే చిత్రహింసలు పెట్టాడు. ఇంతకీ సాగర్ పోలీసులకు చిక్కుతారా? లేదా అనేది చూడాలి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |