UPDATES  

NEWS

 హేమ కమిటీ రిపోర్ట్ పై స్పందించిన సమంత…

మ‌ళ‌యాల సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న హేమ క‌మిటీ రిపోర్టుపై తాజాగా హీరోయిన్ స‌మంత తొలిసారిగా స్పందించారు. హేమ క‌మిటీ ప‌నితీరును స‌మంత ప్ర‌శ‌సించారు. కేర‌ళ‌లోని ఉమెన్ ఇన్ సినిమా క‌లెక్టివ్ చొర‌వ వ‌ల్లే హేమ కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపింది. దీని కార‌ణంగానే ప‌రిశ్ర‌మ‌లో మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, స‌మ‌స్య‌లు వెలుగులోకి వ‌చ్చాయి. సురక్షితమైన, గౌరప్రదమైన పని ప్రదేశాల కోసం మహిళలు ఎన్నో యేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా ఎటువంటి ఫ‌లితం లేకుండా పోయింది. ఇప్ప‌టికైనా ఆ విష‌యాల‌పై స‌రైన నిర్ణ‌యం తీసుకుంటార‌ని ఆశిస్తున్నాను అంటూ న‌టి స‌మంత కోరారు.

 

హేమ క‌మిటి నివేదిక‌పై న‌టి స‌మంత తొలిసారిగా స్పందించారు. త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఈ విధంగా రాసుకొచ్చారు.. “కేరళలోని ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (WCC) అద్భుతమైన పనితీరును నేను చాలా ఏళ్ల నుంచి గ‌మ‌నిస్తూనే ఉన్నాను. దీని ప‌నితీరు వ‌ల్లే హేమ కమిటీ నివేదిక ఇచ్చింది. దీని చొర‌వ వల్లే ఇండ‌స్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో స‌మ‌స్య‌లు, ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. సురక్షితమైన, గౌరప్రదమైన పని ప్రదేశాల కోసం మహిళలు ఎన్నో యేళ్ల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించడంలేదు. ఇప్పటికైనా ఈ విషయాలపై స‌రైన నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను.. డ‌బ్య్లూసీసీలో ఉన్న నా స్నేహితులకు, సోదరీమణులకు నా కృతజ్ఞతలు” అంటూ సమంత తన ఇన్ స్టా స్టోరీలో చెప్పుకొచ్చారు.

 

17 మంది రాజీనామా…

గ‌త కొన్ని రోజులుగా మలయాళీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు, స‌మ‌స్య‌లు ఒక్కొక్కటిగా బ‌య‌టికొస్తున్నాయి. జస్టిస్ హేమ కమిటీ అందించిన నివేదికలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. సీనియర్ నటులపై అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. సీనియ‌ర్ న‌టుల‌పై మాత్ర‌మేకాకుండా అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA) సభ్యులపై కూడా అనేక ఆరోపణలు రావడంతో, వీటిన్నింటికి నైతిక బాధ్యత వహిస్తూ మోహ‌న్‌లాల్ త‌న అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయనతోపాటు మరో 17 మంది తమ పదవుల నుంచి వైదొల‌గారు. హేమ‌ క‌మిటీ నివేదిక‌పై ఇప్పటికే మలయాళీ సినీ ప్రముఖులు కూడా స్పందించారు. ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితిని అసలు ఊహించలేదంటూ చాలామంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక‌, తాజాగా హేమ కమిటీ రిపోర్ట్ పై న‌టి సమంత తొలిసారిగా స్పందించారు. కమిటీ పనితీరును ఆమె ప్రశంసించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |