ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న బాలీవుడ్ నటి కాదంబరీ జత్వానీ విజయవాడకు చేరుకున్నారు. మరికాసేపట్లో ఆమె పోలీస్ కమిషనర్‌ను కలిసి వివరాలు సమర్పించనున్నారు. ఆమెపై నమోదు చేసిన ఫోర్జరీ కేసును విచారణ అధికారిగా నియమితురాలైన ఏసీపీ స్రవంతిరాయ్ నేతృత్వంలోని బృందం పరిశీలించనుంది.
ఏపీలోని గత ప్రభుత్వ హయాంలో నటిపై తీవ్రమైన వేధింపులు జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఇందులో రాజకీయ నాయకులతోపాటు, ఇద్దరు ఐపీఎస్‌లు, ప్రభుత్వంలోని కీలక నేతల ప్రమేయం కూడా ఉన్న విషయం వెలుగులోకి వచ్చి హాట్ టాపిక్ అయింది. గత ప్రభుత్వం హయాంలో తాను పడిన ఇబ్బందుల గురించి మీడియా ముఖంగా చెబుతూ జత్వానీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ కేసులో అసలు నిజాలను నిగ్గు తేల్చేందుకు సీసీఎస్ ఏసీపీ స్రవంతి రాయ్‌ను విచారణ అధికారిగా నియమించింది.