UPDATES  

NEWS

 రైతు రుణ మాఫీపై తెలంగాణ సర్కార్ కసరత్తు..!

రైతు రుణ మాఫీపై తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఆగస్ట్ 15 లోపు రైతు రుణాలు మాఫీ చేయాలని భావిస్తోంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. రైతు రుణ మాఫీపై త్వరలోనే మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోనున్నారు. రైతుల రుణాలు మాఫీ చేయాలంటే.. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద అంత డబ్బు లేదు. దీంతో బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని రైతులు రుణాలు మాఫీ చేయాలని భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణ మాఫీ చేస్తామని ఇప్పటికే స్పష్టం చేయడంతో అధికారులు బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నారు.

 

రైతు రుణ మాఫీ కోసం ఒక కార్పొరేషన్ ను ఏర్పాటు చేయనున్నారు. ఆ కార్పొరేషన్ కు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకురానున్నారు. వచ్చిన డబ్బులను రైతు రుణ మాఫీకి వినియోగించనున్నారు. రుణ మాఫీ చేయాలంటే రూ.30 వేల కోట్లకు పైగా నిధులు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తాన్ని బ్యాంకుల నుంచి తీసుకొచ్చి.. ఆ తర్వాత బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది.

 

అసెంబ్లీ ఎన్నికల్లో రూ.2 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి హామీ అమలుకు చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వం రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ.. సంవత్సరానికి కొంత మాఫీ చేసింది. అయితే పూర్తి స్థాయిలో రైతు రుణాలు మాఫీ కాలేదు. దీంతో కాంగ్రెస్ ఒకేసారి రైతుల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ దిశగా పని చేస్తోంది. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేసి తీరుతామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పారు.

 

మాజీ మంత్రి హరీశ్ రావు ఎన్నికల ముందు చేసిన చాలెంజ్కు కట్టుబడి స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామా లేఖను సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ అంశంపై పక్కకు పారిపోకుండా హరీశ్ మానసికంగా సిద్ధంగా ఉండాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం పాటు పడే వ్యక్తి అని చెప్పారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |