UPDATES  

NEWS

 గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘జై హనుమాన్’ కొత్త పోస్టర్….

టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. యంగ్ హీరో తేజ సజ్జ నటించిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.

 

ముఖ్యంగా ఈ మూవీలో విఎఫ్ఎక్స్ విజువల్స్ అదిరిపోయాయనే చెప్పాలి. అంతేకాకుండా దర్శకుడు ప్రశాంత్ వర్మ క్రియేటివిటీ కూడా మరింత గ్రాండ్ లెవెల్లో ఉంది. ఈ కారణంగానే సినిమా బాక్సాఫీసు వద్ద భారీ హిట్‌ను అందుకుంది. అంతేకాకుండా కలెక్షన్లలో కూడా తన హవా చూపించింది.

 

 

దాదాపు రూ.300 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి అబ్బురపరచింది. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దర్శకుడు సీక్వెల్‌ను ప్రకటించాడు. ఈ చిత్రానికి గానూ టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ‘జై హనుమాన్’ టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపాడు. అయితే ఈ సీక్వెల్ మూవీ ప్రకటించినప్పటి నుంచి అందరిలోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

 

ఈ చిత్రాన్ని మరింత అద్భుతంగా దర్శకుడు తెరకెక్కించబోతున్నాడు. అయితే ఈ మూవీకి సంబంధించి అప్డేట్‌కోసం సినీ ప్రియులు, అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘జై హనుమాన్’ మూవీ మేకర్స్ అదిరిపోయే అప్డేట్‌ను అందించారు. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

 

ఈ పోస్టర్‌లో రాముడికి ఆంజనేయుడు మాట ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. అందుకు సంబంధించిన పోస్టర్‌ను దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ ఇలా రాసుకొచ్చాడు. ‘‘ శ్రీరాముడి దివ్య ఆశీర్వదంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ ఇది నా వాగ్దానం. మునుపెన్నడూ లేని అనుభూతిని, జీవితకాలం జరుపుకునే చలన చిత్రాన్ని మీకు అందిస్తానని’’ రాసుకొచ్చాడు. దీనిబట్టి చూస్తే జై హనుమాన్ మూవీ మరింత గ్రాండ్ విజువల్స్‌తో అద్భుతంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |