ఢిల్లీ హైకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. లిక్కర్ పాలసీ కేసులో అవినీతి ఆరోపణలు కింది జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారించింది. తన అరెస్ట్, రిమాండ్ ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు.
సీఎం అరెస్టుపై జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. అయితే దీన్ని విచారించిన ధర్మాసనం ఏప్రిల్ 2వ తేదీ లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటుగా ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసినట్లు వెల్లడించింది.
ఇప్పటికే తన అరెస్ట్, రిమాండ్ పై విచారణ వాయిదా పడిన కేజ్రీవాల్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కేజ్రీవాల్ సీఎం పదవి నుంచి తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టులు పిల్ దాఖలైంది. ఈ పిల్ పై రేపు ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.