UPDATES  

NEWS

 ‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్ డేట్ రివీల్ చేసిన నిర్మాత దిల్ రాజు..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ మూవీ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్‌గా చరణ్ బర్త్ డే కానుకగా ఈ మూవీ నుంచి ‘జరగండి.. జరగండి’ అనే సాంగ్‌ను విడుదల చేసి సినీ ప్రియులు, మెగా అభిమానుల్లో ఫుల్ జోష్ నింపారు మేకర్స్.

 

అయితే ఇప్పుడు మరో అప్డేట్.. సినిమా రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తారా? అని కళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఓ ఈవెంట్‌లో ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి నిర్మాత దిల్ రాజు అదిరిపోయే అప్డేట్ అందించాడు. ఈ మేరకు ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్‌ను రివీల్ చేశాడు.

 

ఇందులో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ‘అరెయ్ దిల్ మామా గేమ్ ఛేంజర్ మూవీ నుంచి మాకొక అప్డేట్ ఇవ్వు అని అభిమానులు కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. అయితే మీ ఓపికలకు చాలా పరిక్ష పెడుతున్నాము.

 

కానీ ఒక ఉప్పెన, ఒక తుఫాను వచ్చేముందు మనం ఓపిక పట్టక తప్పదు. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి రామ్ చరణ్ ఇప్పుడు మెగాపవర్ స్టార్ కాదు.. గ్లోబల్ స్టార్ అయ్యారు. ఆ రేంజ్‌కి సినిమా రీచ్ అవ్వాలంటే డైరెక్టర్ శంకర్ ఒక్కొక్క పాటని, ఒక్కొక్క సీన్‌ని చాలా ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు.

 

ఇంకొక్క నాలుగైదు నెలలు ఓపిక పడితే మీ ముందుకి గేమ్ ఛేంజర్ మూవీ వచ్చేస్తుంది. మరో రెండు నెలల్లో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. అయితే రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘జరగండి.. జరగండి’ సాంగ్‌లో మీరు చూసింది జస్ట్ 2శాతం మాత్రమే. మిగిలిన 98 శాతం క్రియేటివిటీని డైరెక్టర్ శంకర్ దాచిపెట్టి ఉంచారు.

 

అయితే మూవీ రిలీజ్ అయిన రోజు ‘జరగండి’ సాంగ్ ప్రయోజనమేంటనేది అప్పుడు అర్థం అవుతుంది. అయితే ఈ ఒక్కసాంగే కాదు. మొత్తం ఐదు సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. అందులో 3 సాంగ్స్‌ అయితే గూస్ బంప్స్ తెప్పించడం పక్కా. థియేటర్లలో మీ కుర్చిలో మీరు కూర్చోరు.. పైకి లేచి డ్యాన్స్ చేసేస్తారు. కాబట్టి కాస్త ఓపిక పట్టండి’’ అంటూ చెప్పుకొచ్చాడు.

 

ఈ అప్డేట్‌తో మెగా అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. కాగా దిల్ రాజు ఇచ్చిన అప్డేట్ ప్రకారం.. ఈ మూవీ మరో నాలుగైదు నెలలు అంటే జూలై లేదా ఆగస్టులో రిలీజ్ కావచ్చని తెలుస్తోంది. అదే ఆగస్టులో అల్లు అర్జున్ సినిమా ‘పుష్ప2’ రిలీజ్ కానుంది. మరి ఆ టైంలోనే రిలీజ్ చేస్తారా? లేక అంతముందు నెల జూలైను ఎంచుకుంటారా? అనేది చూడాలి. కాగా ఈ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా.. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |