ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha).. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru) తో డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు సమంత ఎక్కడికి వెళ్లినా ఆమెతో పాటే డైరెక్టర్ రాజ్ కూడా దర్శనమిస్తున్నారు. మొన్నటికి మొన్న శ్రీకాళహస్తి, తిరుపతిలో దర్శనమిచ్చిన ఈ జంట.. ఇప్పుడు ఏకంగా అత్యంత చనువుగా ఉన్న ఫోటోలు షేర్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. సమంత తాజాగా నిర్మాతగా మారి ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం ‘శుభం’. ఈ మే 9న విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా రాజ్ నిడిమోరు భుజంపై తలపెట్టి ఫోటోలకు ఫోజులిచ్చింది సమంత. అంతేకాదు ఈ ఫోటోలను ఆమె స్వయంగా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేయడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.
రాజ్ తో డేటింగ్ లో సమంత.. శ్యామల పోస్ట్ వైరల్..
ఇక వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు అంటూ ఇక జోరుగా ప్రచారం సాగుతున్న వేళ.. రాజ్ నిడిమోరు భార్య శ్యామల (Shyamala ) తన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. శ్యామల తన ఇన్స్టా పోస్టులో..”నాకోసం ఆలోచించేవారు.. వినేవారు.. వినిపించేవారు.. మాట్లాడేవారు.. మాట్లాడించేవారు.. చదివేవారు.. రాసేవారిని ఎప్పటికీ నేను ప్రేమిస్తూనే ఉంటాను.. నా ఆశీర్వాదాలు పంపుతూనే ఉంటాను” అంటూ రాసుకు వచ్చింది. ఇది చూసిన చాలా మంది రాజ్ , సమంతా రిలేషన్ గురించేనా అంటూ చర్చించుకుంటున్నారు. మొత్తానికైతే సమంత ఇలా రాజ్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు రావడంతో.. అటు శ్యామలకి అన్యాయం చేస్తోందేమో అనే రేంజ్ లో నెటిజన్స్ సమంతా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రూమర్లకు సమంత కచ్చితంగా సమాధానం చెప్పి తీరాలని అభిమానులు కూడా ఫైర్ అవుతూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే శ్యామల పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారింది.
ప్రేమకు పునాది అక్కడేనా..?
ఇకపోతే సమంత.. నాగచైతన్య (Naga Chaitanya) ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత.. రాజ్ దర్శకత్వంలో బాలీవుడ్ లో వచ్చిన ‘ది ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్ లో నటించి ఆకట్టుకుంది. ఇక ఈ వెబ్ సిరీస్ విడుదలైన తర్వాతనే నాగచైతన్య – సమంత మధ్య విభేదాలు తలెత్తాయి.తర్వాత ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్లో చాలా బోల్డ్ గా సమంత నటించడమే కాకుండా ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజ్ రిలేషన్ లో ఉందని.. అందుకే విడాకులయ్యాయి అంటూ కొంతమంది వార్తలు గుప్పించారు. తర్వాత సమంత ఎన్నో అవమానాలు ఇబ్బందులు ఎదుర్కొని మళ్ళీ ‘సిటాడెల్ హనీ బన్నీ’ వెబ్ సిరీస్ తో కం బ్యాక్ ఇచ్చింది.ఈ సీరీస్ కి కూడా రాజ్ దర్శకత్వం వహించడం గమనార్హం. ఇక ఈ వెబ్ సిరీస్ తర్వాత వీరిద్దరి రిలేషన్ బయటపడింది.