ఇపిఏస్ పెన్షనర్స్ కు కనీస పెన్షన్ రూ. 9 వేలు ఇవ్వాలి. ఫిబ్రవరిలో చలో ఢిల్లీ. కడప పిఎఫ్ ఆఫీస్ ఎదుట విద్రోహ దినం పాటించిన పెన్షనర్లు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఈపీఎస్ పెన్షనర్ లకు కనీస పెన్షన్ రూ. 9000 ఇవ్వాలని సోమవారం పిఎఫ్ కార్యాల మీదట పెన్షనర్ లు విద్రోహ దినం పాటించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇపీఎస్ పెన్షనర్లకు పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆయన తెలిపారు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి అన్ని వర్గాల ప్రజలపై భారాలు మోపుతున్నారని నిత్యాసర వస్తువులు ధరలు మొదలుకొని గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో ఈపీఎస్ పెన్షనర్స్ కు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తే ఏ రకంగా బతుకుతారని, ధరలు పెంచిన ప్రభుత్వం పెన్షన్ పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆరు నెలలకు ఒకసారి డి ఎ చెల్లించాలని, కనీస పెన్షన్ రూ. 9000 ఇవ్వాలని, పెన్షనర్ దారులకు ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని ఈఎస్ఐ ద్వారా వైద్య సౌకర్యం కల్పించాలని, ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
పెన్షనర్లకు గతంలో రైల్వేలో రాయితీలు ఇచ్చే వారిని ఇప్పుడు రద్దు చేయడం చాలా అన్యాయమని ఆయన తెలిపారు. పెన్షనర్స్ సమస్యలపై గతంలో హై పవర్ కమిటీ వేశారని దానిని బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెన్షనర్స్ సమస్యలపై ఫిబ్రవరి లో ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు శ్రీకారం చూడుతున్నట్లు ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో వామపక్ష కార్మిక సంఘాల నాయకులు శ్రీనివాసులు రెడ్డి మనోహర్ నాగ సుబ్బారెడ్డి బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ నాయకులు కళ్యా సుధాకర్, విద్యుత్ కార్మిక సంఘం నాయకులు సుదర్శన్ రెడ్డి యు పి ఎఫ్ టీచర్స్ నాయకులు లక్ష్మీరాజ డిసిసి పెన్షనర్స్ బ్రహ్మం, జువారి సిమెంట్ ఫ్యాక్టరీ నాయకులు బయ న్న, ఆల్విన్ పెన్షనర్స్ కార్మిక సంఘం నాయకులు సాంబశివారెడ్డి పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి హరిచంద్ర రెడ్డి పులివెందుల పాపిరెడ్డి వెంకటేశ్వర్లు బాలబాయన్న తదితరులు పాల్గొన్నారు