లేడీ సూపర్ స్టార్ నయనతార వర్సెస్ ధనుష్.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వివాదం. ఒకప్పుడు ఫ్రెండ్స్ గా ఉన్న వీరి మధ్య వివాదం ఎందుకు వచ్చింది.. ? ఆ వివాదానికి కారణం ఏంటి.. ? అనేది తెలుసుకుందాం. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే పేరుతో నయన్ జీవితంలోని కొన్ని అంశాలను ఒక డాక్యుమెంటరీగా నెట్ ఫ్లిక్స్ తెరకెక్కించింది. నయన్ కెరీర్ మొదలుపెట్టిన దగ్గరనుంచి ఆమె పెళ్లి వరకు.. ఏం జరిగింది.. ? ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంది.. ? ఎంతమందిని నమ్మింది.. ? ఎవరు మోసం చేశారు.. ? అనేది మొత్తం చెప్పుకొచ్చింది.
డాక్యుమెంటరీ అంటే.. సినిమాలా, సిరీస్ లా ఆర్టిఫీషియల్ గా ఉండదు. నిజ జీవితంలో ఉన్న వ్యక్తులే మాట్లాడుతూ.. అప్పట్లో జరిగిన సంగతులను చెప్తూ ఉంటారు. నయన్ డాక్యుమెంటరీలో కూడా.. నయన్, విగ్నేష్, నయన్ డైరెక్టర్స్, నయన్ హీరోస్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మాట్లాడారు. ఇక దీనికి ధనుష్ కు సంబంధం ఏంటి అంటే.. నయన్ లైఫ్ జర్నీ గురించి చెప్పాలంటే.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారి సినిమాలు చేసినా.. ఆమెను నమ్మి అలాంటి సినిమాలకు పెట్టుబడి పెట్టిన నిర్మాతల గురించి చెప్పాలి. అలాంటి ఒక నిర్మాతనే ధనుష్.
విజయ్ సేతుపతి, నయన్ జంటగా విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నేను రౌడీనే. ఈ సినిమాకు ధనుష్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నయన్, విగ్నేష్ కలవడానికి ఈ సినిమానే పునాది. ఈ సెట్ లోనే వీరి ప్రేమ మొదలయ్యింది. డాక్యుమెంటరీ మొత్తంలో ఈ సినిమాకు సంబంధించిన క్లిప్స్ నే ఎక్కువ ఉపయోగించాలి. ఇక దానికోసం.. నయన్, నేను రౌడీనే నిర్మాత ధనుష్ దగ్గర నుంచి అనుమతిని తీసుకోవాలి. కానీ,ధనుష్.. రెండేళ్లుగా ఆ అనుమతి పత్రం ఇవ్వడం లేదని నయన్ ఆరోపించింది.
ఇక సినిమాలోని క్లిప్స్ కాకుండా తమ ఫోన్స్ లో తీసిన మేకింగ్ వీడియోస్ ను నయన్ ఈ డాక్యుమెంటరీలో వాడింది. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ ట్రైలర్ లో ఈ షాట్స్ కూడా కనిపించడంతో.. ధనుష్, నయన్ పై లీగల్ గా కేసు వేశాడు. తన అనుమతి లేకుండా.. తన సినిమా క్లిప్స్ ను వాడినందుకు రూ. 10 కోట్లు ఇవ్వాలని, లేకపోతే వాటిని తొలగించాలని డిమాండ్ చేశాడు. ఇక నయన్ చాలా బేరసారాలు చేసి.. చివరకు ధనుష్ కనికరించకపోవడంతో ఒక బహిరంగ లేఖ రాసి అందులో ధనుష్ వ్యక్తిగత విషయాలను, కెరీర్ ను దిగ్గజార్చే వ్యాఖ్యలు చేసింది.
గత మూడు రోజులుగా ఈ వివాదం నడుస్తూనే ఉంది. ఈ వివాదం ఇంకా ముగియకుండానే.. నేడు నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ధనుష్ మాటను లెక్కచేయని నయన్.. నేను రౌడీనే మేకింగ్ షాట్స్ ను అలాగే డాక్యుమెంటరీలో పెట్టించేసింది. ఇక ఇప్పుడు ధనుష్ లాయర్ మరోసారి నయన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
” నా క్లయింట్ ధనుష్ అనుమతి లేకుండా తనకు సంబంధించిన సినిమా నుంచి తీసుకున్న క్లిప్స్ వెంటనే తొలగించాలి. లేదంటే రూ.10 కోట్లు చెల్లించాలి. అలా చేయని పక్షంలో నయన్ తో పాటు నెట్ ఫ్లిక్స్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని” తెలిపాడు. ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మరి నయన్ వర్సెస్ ధనుష్.. చివరకు ఎవరు గెలుస్తారు అనేది చూడాలి.