హీరోయిన్ అనుష్క శెట్టి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతి తక్కువ కాలంలోనే అనుష్క తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. తెలుగులో స్టార్ హీరోలందరితోనూ నటించి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుందామె. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగులో హీరోలతో సమానంగా అనుష్కకు మార్కెట్ ఉందంటే అతిశేయోక్తి కాదు.
అయితే గత కొంతకాలంగా అనుష్క సినిమాలు చేయడం తగ్గించేసిందనే చెప్పాలి. జీరోసైజ్ సినిమాతో లావు పెరగిన అనుష్క తరువాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసింది. దాదాపు 100 కేజీలకు పైగా బరువు పెరిగి షాకిచ్చింది. ఆవెంటనే నిశ్శబ్దం సినిమా కోసం బరువు తగ్గి మాములు స్థితిలోకి వచ్చింది. గతేడాది యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా తర్వాత అనుష్క ల్యాంగ్ గ్యాప్ ఇచ్చింది. ఇటీవలే అనుష్క తన కొత్త సినిమాపై అఫిషియల్‌గా ఎనౌన్స్‌మెంట్ చేసింది. ‘కథానర్’ అనే సినిమాలో నటించడానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ సినిమాతో అనుష్క మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇండస్ట్రీకి వచ్చిన 19 ఏళ్ళ తరువాత మొదటిసారి మలయాళం సినిమాలో నటించబోతుంది అనుష్క.
ఇదిలా ఉంటే అనుష్కకు పెళ్లికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అనుష్క ఓ 42 ఏళ్ల కన్నడ నిర్మాతను పెళ్లి చేసుకోబోతుందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో ఈ విషయం తెలిసిన వారంతా నిజంగానే ఆమె పెళ్లి చేసుకోబోతోందా? అని షాక్ అవుతున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఇదింతా రూమర్స్ అని కొట్టిపారేస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రభాస్‌ను వదిలేసి నిర్మాతను ఎలా వివాహం చేసుకుంటుందని అనుష్కను ప్రశ్నిస్తున్నారు. అయితే పెళ్లిపై అనుష్క క్లారిటీ ఇచ్చే వరకు ఇలాంటి వార్తలు వస్తునే ఉంటాయి. మరి తన పెళ్లిపై వస్తోన్న వార్తలపై అనుష్క ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.









