UPDATES  

NEWS

 ఏపీ ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. మార్గదర్శకాలు విడుదల..

ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలను విడుదల చేసింది. అంతే కాకుండా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలొ పోలీసు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ మెయిల్, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి అందు కోసం ప్రచారం కల్పించాలి సూచించింది.

 

కేంద్ర పర్యవరణ శాఖ తరుచూ తనిఖీలు చేపట్టాలని తెలిపింది. దాంతో పాటు రాష్ట్ర అధికారులకు ఇందుకు సంబంధించిన సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని వెల్లడించింది. సుప్రీం కోర్టు చెప్పిన తర్వాత కూడా యంత్రాలు వాడారని కేంద్ర పర్యావరణ శాఖ తరపున న్యాయవాది తెలుపగా..అటువంటివి తిరిగి పునరావృతం అయితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని కోర్టు వెల్లడించింది.

 

ఎన్టీటీ తీర్పులోని ప్రతి అంశాన్ని తప్పకుండా పాటించాలని ఆదేశించింది. కేంద్ర అధికారులు గుర్తించిన మైనింగ్ ప్రదేశాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అంతే కాకుండా ఆయా ప్రదేశాలను జిల్లా కలెక్టర్లు తనిఖీ చేయాలని వెల్లడించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే అటువంటి వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. జూన్ 9 లోపు ఆదేశాల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్ సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జులై 15 కు కోర్టు వాయిదా వేసింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |