తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికలు ముగిసిన అనంతరం సోమవారం రాత్రి 7 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించినట్లుగా తెలిపారు. రాష్ట్రంలో పోలింగ్శాతం బాగానే నమోదైందని పేర్కొన్నారు.
తుది ఓటింగ్శాతం ఎంత అనేది రేపు(మంగళవారం) వెల్లడిస్తామని వికాస్ రాజ్ తెలిపారు. సోమవారం వివిధ కారణాలపై 38 కేసులు నమోదు చేశామని ఆయన వెల్లడించారు. జీపీఎస్ఉన్న వాహనాల్లో ఈవీఎంలు తరలిస్తామన్నారు. తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు.
అత్యధికంగా మెదక్‌లో 71.33 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా హైదరాబాద్‌లో 39.17 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు. కేంద్రం ఆధ్వర్యంలో ఉండే యాప్ లలో 415 ఫిర్యాదులు రాగా, వేర్వేరు ప్రాంతాల్లో ఈరోజు 38 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని వికాస్ రాజ్ తెలిపారు. 225 ఫిర్యాదులు సీవిజిల్ యాప్ ద్వారా వచ్చాయన్నారు.
మొత్తం రూ.330 కొట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి రూ.330 కోట్లు సొత్తు స్వాధీనం చేసుకున్నట్లుగా వికాస్రాజ్తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14 వందల కేంద్రాల్లో పోలింగ్ కొనసాగిందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 స్ట్రాంగ్ రూంలు ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు.
భారీ బందోబస్తు మధ్య ఈవీఎంలు తెల్లవారుజాము వరకు స్ట్రాంగ్ రూమ్లకు చేరతాయని తెలిపారు. ఖచ్చితమైన పోలింగ్ శాతం(మంగళవారం) మధ్యాహ్నం వరకు తెలుస్తుందన్నారు. పోలింగ్పై మంగళవారం స్క్రూటినీ ఉంటుందని, ఎక్కడైనా రీ-పోలింగ్ అవసరమైతే రేపు తెలుస్తుందని వెల్లడించారు.