UPDATES  

NEWS

 నా పోరాటానికి మద్దతు కావాలి.. తీహార్ జైలు నుంచి విడుదలైన అరవింద్ కేజ్రీవాల్..

తాను నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు.

 

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జూన్1 వరకు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు నుంచి విడుదలైన ఆయనకు ఆమ్ ఆద్మీపార్టీ నేతలు, విపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం కారులో వెళ్తూ ప్రజలకు కేజ్రీవాల్ అభివాదం చేశారు.

 

ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ వారికి అభివాదం చేస్తూ ప్రసంగించారు. హనుమాన్‌ దయ వల్లే బయటకు వచ్చానని అన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు హనుమాన్‌ ఆలయాన్ని దర్శిస్తానని చెప్పారు. మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీంకోర్టు జడ్జిలకు కృతజ్ఞతలు తెలిపారు. వారి వల్లే ఈరోజు మీ ముందుకొచ్చానని తెలిపారు కేజ్రీవాల్.

 

‘నన్ను ఆశీర్వదించిన కోట్లాది మంది ప్రజలకు కృతజ్ఞతలు. నియంతృత్వం నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలి. నా శక్తిమేరకు పోరాడతాను. కానీ, 140 కోట్ల మంది ప్రజల మద్దతు కావాలి. శనివారం మధ్యాహ్నం 1 గంటకు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిస్తాం’ అని కేజ్రీవాల్వ్యాఖ్యానించారు.

 

మరోవైపు, కేజ్రీవాల్‌ ఇంటి వద్ద ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 50 రోజుల తర్వాత విడుదలైన కేజ్రీవాల్‌ తన కాన్వాయ్‌లో ఇంటికి బయల్దేరారు. వాహనంలో ఆయన సతీమణి సునీత, కుమార్తె హర్షిత, ఆప్‌ రాజ్యసభ ఎంపీ సందీప్‌ పాఠక్‌ ఉన్నారు. కేజ్రీవాల్ నివాసం వద్ద, పార్టీ కార్యాలయం వద్ద ఆప్ శ్రేణులు టపాసులు కాల్చుతూ సంబరాలు చేసుకున్నాయి.

 

సీఎం కార్యాలయానికి అనుమతి లేదు

 

కాగా, అంతకుముందు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జూన్‌ 1 వరకు అరవింద్‌ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ బెయిల్‌ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆయనకు జూన్‌ 1 వరకు బెయిల్‌ ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. రూ.50వేల పూచీకత్తు, అంతే మొత్తానికి ఒకరి ష్యూరిటీపై ఈ బెయిలిచ్చింది.

 

అయితే, కేజ్రీవాల్‌కు జూన్‌ 5వ తేదీ వరకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలంటూ సీఎం తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ చేసిన అభ్యర్థనను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. జూన్‌ 2న ఆయన లొంగిపోయి తిరిగి జైలుకు వెళ్లాలని స్పష్టం చేసింది. బెయిల్‌ నిబంధనలను కేజ్రీవాల్తప్పనిసరిగా పాటించాలని తేల్చి చెప్పింది. సీఎం కార్యాలయానికి గానీ, ఢిల్లీ సచివాలయానికి గానీ వెళ్లొద్దని ఆదేశించింది. లిక్కర్ కేసులో తనపై వచ్చిన అభియోగాల గురించి కూడా మాట్లాడొద్దని స్పష్టం చేసింది. కేసుకు సంబంధించిన అధికారిక ఫైళ్లను చూడొద్దని, సాక్షులతో మాట్లాడొద్దని స్పష్టం చేసింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |