బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. బాహుబలి సినిమా సాధించిన విజయం గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్ అన్నీ పాన్ ఇండియా సినిమాలే తీస్తున్నాడు. ఆదిపురుష్ వంటి సినిమాలు భారీ డిజాస్టర్‌ను మిగిల్చిన సలార్ వంటి మూవీతో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది రీలిజయిన సలార్ చిత్రం రికార్డుల వర్షం కురిపించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ చిత్రం ఏకంగా 700 కోట్ల వరకు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక, ఈ సినిమా సెకండ్ పార్ట్ కూడా ఉంది. దీని కోసం ప్రభాస్ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంతో పాటు ప్రభాస్ కల్కి సినిమా కూడా తీస్తున్న సంగతి తెలిసిందే. కల్కి కూడా పాన్ ఇండియా మూవీనే.
ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమా షూటింగ్‌లో బిజి బిజిగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. అయితే, ఈ చిత్రంలో ప్రభాస్ చాలా డిఫరెంట్ రోల్‌లో కనిపించనున్నారట. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. అయితే, ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్నప్పటి నుంచి నెట్టింట్లో ఏదో ఒక న్యూస్ వైరల్‌గా మారుతుంది. ఇప్పడు మరో కొత్త న్యూస్ తెరపైకి వచ్చింది. కల్కి సినిమాలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ప్రిన్స్ మహేష్‌బాబును కలిసినట్లు టాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ విష్ణుమూర్తి అవతారంలో కనిపించనున్నారట.. అయితే, ప్రభాస్ క్యారెక్టర్‌ను పరిచయం చేసేందుకు మహేష్‌బాబును తీసుకున్నట్లు సమాచారం. ఇక, కల్కి సినిమాలోని ప్రభాస్ ఎంట్రీకి, ఎలివేషన్‌కు మహేష్‌బాబు వాయిస్‌ను ఇవ్వనున్నారనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. మహేష్‌బాబు గతంలో చాలా సినిమాలకు తన వాయిస్‌ను ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ కోసం మహేష్ బాబు తన వాయిస్ ఇవ్వనున్నారని సమాచారం. అయితే, ఈ న్యూస్ గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు
మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాతో ఫుల్ బిజిగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక, ప్రభాస్ నటించే కల్కి సినిమాలో చాలామంది బాలీవుడ్ తారలు కనిపించనున్నారు. బిగి బి అమితాబ్ బచ్చన్‌తో పాటు, విలక్షణ నటుడు కమల్‌హాసన్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే, దిశా పటాని వంటి వారు కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు.