UPDATES  

NEWS

 నేడే ఇందిరమ్మ ఇళ్ల యాప్ ఆవిష్కరణ.. కీలక ప్రకటన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి..

సచివాలయంలో ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. విజయోత్సవాల్లో భాగంగా సినీ రంగ ప్రముఖులతో మ్యూజికల్ నైట్, నగరంలోని ప్రముఖ హోటళ్లు, డ్వాక్రా, రెస్టారెంట్లు, సంస్థలచే స్టాళ్ళ ఏర్పాటు, భారీ ఎత్తున డ్రోన్ షో, లేజర్ షో, క్రాకర్స్ షో జరగనున్నాయి. వీటన్నింటిపై రివ్యూ చేశారు సీఎస్. 7 వ తేదీన వందేమాతరం శ్రీనివాస్ బృందం, 8న రాహుల్ సిప్లిగంజ్, 9న థమన్‌తో సినీ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అదే రోజున రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరుగుతుంది. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ నుండి పీవీ మార్గ్ వరకు ఐదు కేంద్రాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికల్లో భిన్న రీతుల సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.

 

నేటి కార్యక్రమాలు

ప్రజా పాలన దినోత్సవాల్లో భాగంగా ఇవాళ ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

⦿ హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఇందిరా మహిళా శక్తి బజార్‌ ప్రారంభోత్సవం

⦿ ఎస్‌హెచ్జ‌జీ ప్లాట్‌ఫాంలలో ఇందిరా మహిళా శక్తి విజయాలు, ప్రజాపాలన విజయాలపై ప్రెస్ మీట్

⦿ ఎల్‌ఈటీ అండ్ ఎఫ్ – మేడ్చల్, మల్లేపల్లి, నల్గొండలో 3 అధునాతన సాంకేతిక కేంద్రాల ప్రారంభోత్సవం

⦿ ఘట్‌కేసర్‌లో బాలికల ఐటీఐ ప్రారంభం

 

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక – మొబైల్ యాప్ ఆవిష్కరణ

ప్రజా విజయోత్సవంలో భాగంగా ఇవాళ ప్రభుత్వం పేద‌వాడి సొంతింటి క‌ల సాకారం చేయనుంది. ల‌బ్దిదారుల ఎంపిక‌కు రంగం సిద్ధం చేసింది. పారదర్శకమైన ఎంపికకు మొబైల్ యాప్ రెడీ చేసింది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ జరగుతుంది. రేపటి నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది. ప్రతి మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ ఏర్పాటు చేస్తున్నారు.

 

రవాణా శాఖ కార్యక్రమాలు

ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఇవాళ రవాణా శాఖ సాధించిన విజయాలపై కీలక కార్యక్రమాలు జరుగుతాయి. రవాణా శాఖ నూతన లోగోను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. రవాణా శాఖ, తెలంగాణ ఆర్టీసీ సాధించిన విజయాలపై బ్రౌచర్ విడుదల చేస్తారు. అలాగే, స్క్రాపింగ్ పాలసీ ఆర్డర్‌ను అందిస్తారు. తెలంగాణ ఆర్టీసీలో కారుణ్య నియామకాల కింద మరణించిన 54 మంది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు నియామక పత్రాలు అందజేస్తారు. మహిళా ప్రయాణికుల బృందానికి మహాలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు ఆదా అయిన మొత్తాన్ని చెక్కు రూపంలో అందిస్తారు సీఎం రేవంత్.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |