UPDATES  

NEWS

 అరుదైన గౌరవం.. జక్కన్న దంపతులకు ఆస్కార్ ఆహ్వానం..!

ఆస్కార్ అవార్డ్. ఈ అవార్డును అందుకోవడం హాలీవుడ్ వారికి కొత్త కాదు కానీ.. తెలుగు సినిమాకు ఆస్కారం రావడం అనేది ఎంతో అమూల్యమైన విషయం. తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో ఏళ్ల కలగా ఉన్న ఆస్కార్ ను RRR సినిమాతో తీసుకొచ్చారు రాజమౌళి. ఈ సినిమాలో కంపోజ్ చేసిన నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డును అందుకుంది.

 

గతేడాది మార్చి 13న లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకలో.. నాటు నాటుపాటకు ఆస్కార్ దక్కింది. ఈ వేడుకకు సినిమా దర్శకుడ రాజమౌళి కుటుంబంతో పాటు రామ్ చరణ్ దంపతులు, ఎన్టీఆర్ దంపతులు, సంగీత దర్శకుడు కీరవాణి, పాటరాసిన చంద్రబోస్, పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ అంతా హాజరయ్యారు. RRRకు ఆస్కార్ దక్కిన ఆ క్షణాలను తలచుకుంటే.. ఇప్పటికే ఏదో సాధించామన్న ఫీలింగ్ వస్తుంది మూవీ లవర్స్ కు. మాటల్లో చెప్పలేని ఆనందాన్ని తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేశారు జక్కన్న. ఇలా చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

 

రాజమౌళి క్రేజ్ అక్కడితో ఆగిపోలేదు. ఈ ఏడాది ఆయనకు ఆస్కార్ అకాడమీ నుంచి ఆహ్వానం అందింది. మరోసారి ఆయన ఆస్కార్ అవార్డుల వేడుకకు అతిథిగా వెళ్లనున్నారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లో చేరాలని రాజమౌళికి, ఆయన భార్య రమకు ఆస్కార్ అకాడమీ నుంచి ఆహ్వానం వచ్చింది. వీరిద్దరితో పాటు.. బాలీవుడ్ ప్రముఖులు షబానా అజ్మీ, రితేష్ సిధ్వాని, రవి వర్మన్ వంటి వారికి కూడా ఆస్కార్ అకాడమీ ఆహ్వానం పంపింది. 57 దేశాల్లో 487 మంది కొత్తవారికి ఈసారి ఆస్కార్ నుంచి ఆహ్వానాలు వెళ్లాయి.

 

కాగా.. ఆస్కార్ అకాడమీలో చేరితో.. ఆస్కార్ రేసులో ఉన్న సినిమాలకు ఓటేసే హక్కు వస్తుంది. అంతేకాదు అకాడమీ తరఫున జరిగే ఈవెంట్లకు, అకాడమీ లైబ్రరీకి వెళ్లొచ్చు. స్పెషల్ స్క్రీనింగ్స్, వర్క్ షాప్స్, సెమినార్లకు హాజరు కావొచ్చు. గతేడాది రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, చంద్రబోస్, కెకె సెంథిల్, సాబు సిరిల్ లు అకాడమీలో చేరారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |