అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి తమ పార్టీ ప్రజా ప్రతినిధులు ఇతర పార్టీల్లో చేరడంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. కొందరు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్‌కు వచ్చే నష్టమేమీ లేదని కేసీఆర్స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా మర్కూక్మండలం ఎర్రవల్లిలోనిఫాంహౌస్‌లో బీఆర్ఎస్ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను కలిశారు.
ఈ సందర్భంగా వారితో కేసీఆర్సమావేశమై బీఆర్ఎస్ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై చర్చించారు. అలాగే బీఆర్ఎస్లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్మాట్లాడుతూ.. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి లాంటి వారు పార్టీ మారడాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.
కొందరు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. వైఎస్రాజశేఖర్రెడ్డి హయాంలో కూడా ఇలాంటివి ఎన్ని జరిగినా భయపడలేదని బీఆర్ఎస్ఎమ్మెల్యేలకు కేసీఆర్ ధైర్యం చెప్పారు. హామీల అమలులో కాంగ్రెస్పార్టీ విఫలమైందని కేసీఆర్వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు కేసీఆర్. భవిష్యత్తులో బీఆర్ఎస్‌కు మళ్లీ మంచి రోజులు వస్తాయని కేసీఆర్ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో తరచూ కలుస్తానని కేసీఆర్చెప్పారు.
కేసీఆర్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ప్రశాంత్రెడ్డిలతో పాటు ఎమ్మెల్యేలు వివేకానంద్, గోపీనాథ్, ప్రకాశ్గౌడ్, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ షేరిసుభాశ్రెడ్డిలతో పాటు మరికొంత మంది నేతలు ఉన్నారు. వీరందరికీ మాజీ సీఎం కేసీఆర్దిశానిర్దేశం చేశారు. రానున్న రోజుల్లో పార్టీకి మంచి రోజులు వస్తాయని స్పష్టం చేశారు.









