ఏపీలో ఎన్నికల సందడి నెలకొంది. మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనుండటంతో రాజకీయ పార్టీలన్నీ కూడా గెలుపుపై ప్రత్యేక దృష్టిని సారించాయి. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత పావులు కదుపుతున్నారు. మరోవైపు ఈసారి జగన్‌ను ఓడించి అధికారం చేజిక్కించుకోవాలని ప్రతిపక్షాలు వ్యూహాలు పన్నుతున్నాయి. నేతలందరూ జోరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ గెలుపే లక్ష్యంగా మేమంతా సిద్ధం సభ నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గాజువాక మేమంతా సిద్ధం సభ నిర్వహించారు. బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ..గడిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం చేసిన పథకాలను ఆయన వివరించారు. ఈ ఎన్నికలు మీ భవిష్యత్‌ను నిర్ణయించేవి ఆయన అభివర్ణించారు. గతంలో ఎప్పుడూ ఇంతలా ప్రజ సంక్షేమం చేయలేదని..నేరుగా అక్క చెల్లెల్లకు డబ్బులిచ్చిందీ లేదని తెలిపారు. 14 ఏళ్లు సీఎంగా చేసినా చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి స్కీమ్ కూడా పేదలకు గుర్తుకు రాదు. 59 నెలల్లో 2లక్షల31 వేల ఉద్యోగాలిచ్చాం.
59 నెలల్లోనే అనూహ్య మార్పులు తీసుకువచ్చాం. 13 జిల్లాలను 26 జిల్లాలు చేశాం. ఇది అభివృద్ధి కాదా. 59 నెలల పాలనలో 17 మెడికల్ కాలేజీలు అభివృద్ధి కాదా అని ప్రతిపక్షాలను ప్రశ్నించారాయన. ఈ సందర్భంగా ఆయన విశాఖ స్టీల్‌ప్లాంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆగింది నావల్లే అని సీఎం జగన్ తెలిపారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడం వల్లే ఇది ఆగిందని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ఐదేళ్లుగా స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు నేను ఒప్పుకోలేదు కాబట్టే..స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదని తేల్చి చేప్పారు. పొరపాటున కూటమికి ఓటేస్తే..స్టీల్‌ప్లాంట్ అమ్మకానికి ఆమోదం తెలిపినట్టే సీఎం జగన్ చెప్పుకొచ్చారు.









