UPDATES  

NEWS

 కేటీఆర్.. చీర కట్టుకుని బస్సు ఎక్కు..: రేవంత్ సెటైర్లు..

అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారంటీలు అమలు చేసిందన్నారు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన జన జాతర సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించాలని కుట్ర చేస్తున్నారన్నారని బీజేపీ, బీఆర్ఎస్‌లపై మండిపడ్డారు.

 

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఒకటయ్యాయని రేవంత్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సెమీఫైనల్స్‌లో కేసీఆర్‌ను ఓడించామని.. మే 13న జరిగే ఫైనల్స్‌లో బీజేపీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని కేటీఆర్‌ అంటున్నారని.. కేటీఆర్‌ చీరకట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కితే హామీలు అమలు గురించి తెలుస్తుందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

 

కారు రిపేర్కు వెళ్లిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని.. కానీ, షెడ్డుకు వెళ్లిన కారును జుమ్మెరాత్ బజార్‌లో తూకానికి అమ్మాల్సిందేనని రేవంత్ రెడ్డి చురకలంటించారు. మహబూబ్‌నగర్‌, నల్గొండలో కాంగ్రెస్‌ జెండా ఎగురువేస్తామని స్పష్టం చేశారు. పాలమూరు- రంగారెడ్డి పూర్తి చేసేందుకు ప్రజలంతా కాంగ్రెస్‌కు అండగా నిలబడాలని ప్రజలను కోరారు.

 

డీకే అరుణను జడ్పీటీసీ, ఎమ్మెల్యే, మంత్రిని చేసింది కాంగ్రెస్సేనని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. డీకే ఆరుణ కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. కేటీఆర్ రైతు భరోసా నిధులు ఇవ్వడం లేదంటున్నారని.. జోగులాంబ సాక్షిగా మే 9 లోపు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో వేస్తామని రేవంత్ చెప్పారు. అదేవిధంగా హరీశ్ రావు రైతులకు రుణమాఫీ చేయలేదని అంటున్నారని.. రాబోయే పంద్రాగస్టు లోపల రూ.2లక్షల రుణమాఫీ చేసి చూపిస్తామని రేవంత్ స్పష్టం చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |