UPDATES  

NEWS

 దేశ రాజకీయాల్లో సంచలనం.. మోదీపై పోటీకి సిద్ధమైన.. ప్రపంచంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌..!

సార్వత్రిక ఎన్నికలకు దేశంలోని అన్ని ప్రధాన పార్టీలు కసరత్తులు మొదలుపెట్టాయి. అయితే ఈ సారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఓ ట్రాన్స్‌జెండర్‌ పోటీ చేయనుంది. అయితే ఆమె ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ట్రాన్స్‌జెండర్‌ కావడం విశేషం.

 

లోక్ సభ ఎన్నికల్లో ఈసారి ప్రధాని మోదీపై ప్రముఖ ట్రాన్స్‌జెండర్‌, శ్రీకృష్ణుడి పరమ భక్తురాలు మహామండలేశ్వర్ హేమాంగి సఖి మా పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నియోజకవర్గంలో మోదీపై ఆమె పోటీ చేయనున్నారు.

 

ఉత్తరప్రదేశ్ లో 20 లోక్ సభ స్థానాలకు పోటీ చేయబోతున్న అఖిల భారత హిందూ మహాసభ(ఏబీహెచ్‌ఎం) మోదీపై హేమాంగి సఖి మాను పోటీగా నిలబెట్టింది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా వారణాసిలో జూన్ 1న తేదీన పోలింగ్ జరగనుంది. కాగా, ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా యూపీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ రాయ్ మరోసారి పోటీకి చేయనున్నారు.

 

అసలెవరీ హేమాంగి సఖి.. ఆమె నేపథ్యం ఏంటి..?

హేమాంగి సఖి గుజరాత్ లోని బరోడాలో జన్మించారు. ఆమె తండ్రి ఓ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ కావడంతో ఆమె కుటుంబం ముంబైకి వలస వెళ్లింది. అయితే హేమాంగి కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. భగవద్గీతను ప్రపంచంలో అనర్గళంగా బోధించగలిగే తొలి ట్రాన్స్‌జెండర్‌ కథకురాలిగా ఖ్యాతిని పొందింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |