UPDATES  

NEWS

 ఆ హీరో వదిలేయడం వల్లే.. సిద్ధు జొన్నలగడ్డ స్టార్ అయ్యారా..?

ప్రేక్షకులు ఎప్పుడూ రొటీన్ సినిమాలను పక్కన పెట్టి కొత్తదనాన్ని కోరుకుంటుంటారు. అయితే ఈ మధ్య ఇది ఎక్కువైపోయింది. సినిమాలో కొత్తదనం ఉంటే తప్ప థియేటర్లకు వెళ్లడం లేదు. అది స్టార్ హీరో సినిమా అయినా.. స్టార్ డైరెక్టర్ తెరకెక్కించే సినిమా అయినా కొత్తదనం మాత్రం పక్కాగా ఉండాలి. లేకపోతే ఫ్లాప్ తప్పదు.

 

అయితే ఒక సినిమా హిట్ కావాలంటే అది డిఫెంట్ కాన్సెప్ట్ అయినా అయి ఉండాలి. లేదంటే కొంచెం కామెడీ జోడించి.. కాస్త రసవత్తరంగా సాగే రొమాంటిక్ సీన్లు అయినా అందులో ఉండాలి. అప్పుడు మాత్రమే థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. అయితే అలాంటిదే తాజాగా ఓ మూవీ థియేటర్లలోకి వచ్చి సూపర్ డూపర్ హిట్ అందుకుంది. అదే ‘టిల్లు స్క్వేర్’.

 

‘డీజే టిల్లు’గా గతంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన హిట్‌ను అందుకుంది. ఇందులో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించగా.. నేహా శెట్టి హీరోయిన్‌గా నటించి అదరగొట్టేసింది. ఈ సినిమాతో నటుడు సిద్దు ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయాడు. అంతక ముందు ఎన్నో సినిమాలో నటించినా సిద్దుకి పెద్దగా ఫేమ్ రాలేదు. కానీ డీజే టిల్లుతో మాత్రం ఓ రేంజ్‌లో పాపులర్ సంపాదించుకున్నాడు.

 

ఇక ఈ మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో సీక్వెల్‌ను ప్రకటించేశారు. అప్పటి నుంచి ఈ సీక్వెల్‌పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలా ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ తెరకెక్కింది. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ అందుకుని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

 

దాదాపు ఫస్ట్ రోజే రూ.23కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి దుమ్ము దులిపేసింది. ఇప్పటివరకు ఈ మూవీ రూ.70 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి నిర్మాతలకు లాభాల పంట పండించింది. ముఖ్యంగా ఈ మూవీలో ఫుల్ ఫన్ అండ్ రొమాన్స్ ఉండటంతో సినిమా మంచి హిట్ అయిందని అంతా అనుకుంటున్నారు. ఇందులో సిద్దు – అనుపమ బోల్డ్ రొమాన్స్‌తో రెచ్చిపోయారు.

 

ఇదిలా ఉంటే.. సిద్దు జొన్నలగడ్డ ఇంత పెద్ద స్టార్ అవ్వడానికి టాలీవుడ్ హీరో కారణమని తాజాగా ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అతను మరెవరో కాదు విజయ్ దేవరకొండ. అవునండీ మీరు విన్నది నిజమే.. ఇంతకీ సిద్దు స్టార్ అవ్వడానికి విజయ్‌కి కారణమేంటని అనుకుంటున్నారా?. డీజే టిల్లు సినిమాని ముందుగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో మూవీ యూనిట్ చేయాలనుకుందట.

 

అందుకు సంబంధించి విజయ్‌కి స్టోరీ కూడా చెప్పారట. కానీ అప్పటికే విజయ్ అర్జున్ రెడ్డి మూవీ చేసి ఉన్నాడు. దీంతో మళ్లీ అలాంటి కథతోనే వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో అని విజయ్ నో చెప్పేశాడట. దీంతో ఆ కథ నేరుగా సిద్దు వద్దకు వచ్చింది. అప్పటికే మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సిద్దు ఈ మూవీకి ఓకే చేసి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు.

 

కాగా ఒకవేళ విజయ్ డీజే టిల్లు సినిమా చేసి ఉంటే సిద్దుకి ఇంత ఫేమ్ వచ్చేది కాదని.. ఒకరకంగా చెప్పాలంటే విజయ్ దేవరకొండ వల్లే సిద్దు స్టార్ అయ్యారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే త్వరలో టిల్లు స్క్వేర్ మూవీకి సీక్వెల్‌గా టిల్లు క్యూబ్ మూవీ రాబోతుంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |