కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో లోకేష్ కనగరాజు ఒకరు. ఇప్పటివరకు ఈయన డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇలా అపజయం ఎరుగని దర్శకుల జాబితాలో లోకేష్ కనగరాజ్ కూడా ఉన్నారని చెప్పాలి. ఇప్పటివరకు కేవలం తమిళ హీరోలతో సినిమాలు చేసిన లోకేష్ త్వరలోనే తెలుగు డైరెక్టర్ గా మారుతూ తెలుగు హీరోతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే .గత కొద్దిరోజులుగా ఈ ప్రాజెక్టు గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఐకాన్ స్టార్ తో లోకేష్ కనగారాజ్?
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త వెలుగులోకి వచ్చింది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నారు అంటూ తమిళ, తెలుగు ఇండస్ట్రీలలో ఈ వార్త హల్చల్ చేస్తోంది . ఇటీవల లోకేష్ అల్లు అర్జున్ కు ఒక కథను చెప్పారట .అయితే కథ విన్న అల్లు అర్జున్ చాలా ఇంప్రెస్ అయ్యారని తెలుస్తోంది. ఈ కథ విన్న బన్నీ లోకేష్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారని తెలుస్తోంది.
సంగీతం అందించనున్న అనిరుధ్…
ఇకపోతే ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించబోతున్నట్లు కూడా వార్తలు బయటకు వచ్చాయి. ఈ సినిమా షూటింగ్ 2026 చివరి నుంచి ప్రారంభం కాబోతుందని ఇండస్ట్రీ సమాచారం. అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈయన ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్టు గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే వెంటనే అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
2027లోనే పుష్ప3..
ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే 50% షూటింగ్ పనులు పూర్తి అయ్యాయని సమాచారం. ఈ సినిమా షూటింగ్ పనులను త్వరగా పూర్తిచేసుకుని లోకేష్ కనగరాజ్ సినిమా పనులలో బన్నీ బిజీ కానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాని 2027 కు పూర్తి చేసి 2027 లో పుష్ప 3 పనులలో అల్లు అర్జున్ బిజీ కాబోతున్నట్టు సమాచారం. ఇలా అల్లు అర్జున్ వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక బన్నీ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈయన చివరిగా పుష్ప2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సక్సెస్ అందుకున్నారో అందరికీ తెలిసిందే.









