UPDATES  

NEWS

 ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం: టిక్కెట్‌పై రూ. 2,300 వరకు పెరగనున్న ధరలు.. రేపటి నుంచే అమలు!

ఇండిగో వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రయాణించే దూరాన్ని బట్టి ఈ ఫ్యూయల్ ఛార్జీలు మారుతుంటాయి. దేశీయ విమాన ప్రయాణాలపై కనీసం రూ. 425 అదనంగా వసూలు చేయనున్నారు. ఇక అంతర్జాతీయ సర్వీసుల విషయానికి వస్తే, మధ్యప్రాచ్య దేశాలకు రూ. 900, ఆగ్నేయాసియా, చైనా మరియు పశ్చిమాసియా దేశాలకు రూ. 1,800, మరియు యూరప్ వెళ్లే సుదీర్ఘ ప్రయాణ విమానాలపై గరిష్టంగా రూ. 2,300 వరకు ఫ్యూయల్ ఛార్జీని వసూలు చేయనున్నారు. ఈ కొత్త ధరలు మార్చి 14 (శనివారం) నుంచే అమల్లోకి వస్తాయని సంస్థ స్పష్టం చేసింది.

విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ వ్యయంలో ఇంధనం వాటా దాదాపు 40 శాతం వరకు ఉంటుంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం కారణంగా ముడి చమురు సరఫరాకు ఆటంకం కలగడం, తద్వారా ఏటీఎఫ్ ధరలు విపరీతంగా పెరగడం విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ అదనపు భారాన్ని సంస్థలే భరించడం కష్టతరంగా మారడంతో, తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రయాణికులపై ఈ భారం వేయాల్సి వచ్చిందని ఇండిగో తన ప్రకటనలో వివరించింది.

ఈ నిర్ణయంతో సాధారణ విమాన ప్రయాణికులపై ఆర్థిక భారం పడనుంది. ముఖ్యంగా సమ్మర్ సీజన్ దగ్గరపడుతున్న తరుణంలో, సెలవుల కోసం ప్రయాణాలు ప్లాన్ చేసుకునే వారికి ఈ ధరల పెరుగుదల ఇబ్బందికరంగా మారనుంది. అంతర్జాతీయంగా చమురు ధరలు స్థిరపడే వరకు ఈ సర్‌ఛార్జీలు కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండిగో బాటలోనే మరికొన్ని బడ్జెట్ ఎయిర్‌లైన్స్ కూడా ఛార్జీలను పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |