UPDATES  

NEWS

 ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దందాకు అడ్డుకట్ట: అసెంబ్లీలో కొత్త బిల్లుకు తెలంగాణ సర్కార్ సిద్ధం!

తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకువచ్చేందుకు కసరత్తు వేగవంతం చేసింది. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని విద్యాశాఖ భావిస్తోంది.

తెలంగాణ విద్యా కమిషన్ ఇటీవల ముఖ్యమంత్రికి అందజేసిన నివేదికలో ఫీజుల నియంత్రణకు గానూ ‘తెలంగాణ ప్రైవేట్ అన్-ఎయిడెడ్ స్కూల్స్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్’ను ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ సిఫారసుల ఆధారంగానే బిల్లు రూపకల్పన చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూడా తమ పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చదివించేందుకు మొగ్గు చూపుతుండటంతో, ఇదే అదునుగా యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఫీజులకు ఈ చట్టం ద్వారా బ్రేక్ వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

అయితే, ఈ ఫీజుల నియంత్రణ ఎంతవరకు సాధ్యమనే దానిపై విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పార్టీల నేతలకు, బడా వ్యాపారవేత్తలకు సొంత విద్యాసంస్థలు ఉండటమే దీనికి ప్రధాన కారణం. రాజకీయాలకు వెన్నుదన్నుగా నిలిచే ఈ వర్గాలు తమ ప్రయోజనాలకు విఘాతం కలిగించే చట్టాన్ని ఎంతవరకు అనుమతిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం పిల్లి మెడలో గంట కట్టే ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని ఎలా అమలు చేస్తుందో వేచి చూడాలి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |