UPDATES  

NEWS

 ‘హైదరాబాద్‌కు హాలీవుడ్ వచ్చేసినట్లే’: నెట్‌ఫ్లిక్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో మరో అంతర్జాతీయ సంస్థ నగరంలో అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) దేశంలోనే తన రెండో కార్యాలయాన్ని హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఏర్పాటు చేసింది. ఈ ‘ఐలైన్ స్టూడియోస్’ ఆఫీస్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఘనంగా ప్రారంభించారు. ముంబై తర్వాత నెట్‌ఫ్లిక్స్ తన కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించడం నగర ప్రాధాన్యతను చాటిచెబుతోంది.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, నెట్‌ఫ్లిక్స్ రాకతో హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ మన నగరానికి వచ్చినట్లేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలోనే తాను హాలీవుడ్ స్థాయిపై దృష్టి పెడతానని చెప్పానని, నెట్‌ఫ్లిక్స్ రాకతో ఆ కల నిజమవుతోందని ఆనందం వ్యక్తం చేశారు. గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి మహానుభావులు సినీ పరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాద్‌కు తీసుకువచ్చారని, ఇప్పుడు టెక్నాలజీతో బాహుబలి, కల్కి, ఆర్‌ఆర్‌ఆర్ వంటి ప్రపంచ స్థాయి చిత్రాలు ఇక్కడి నుండే రూపుదిద్దుకుంటున్నాయని ఆయన గుర్తు చేశారు.

హైదరాబాద్‌లో ఉన్న మౌలిక సదుపాయాలు మరియు మానవ వనరులు గ్లోబల్ కంపెనీలను ఆకర్షిస్తున్నాయని, నెట్‌ఫ్లిక్స్ వ్యాపార విస్తరణకు తమ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలు రావడం వల్ల స్థానిక ప్రతిభకు అంతర్జాతీయ వేదిక లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రతినిధులు, నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |