UPDATES  

NEWS

 ది లిమిటేషన్ యాక్ట్’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు: ఎన్ని ఏళ్లు అద్దెకు ఉన్నా ఆస్తి హక్కు సాధ్యం కాదు

ఒక ఆస్తిని ఎన్ని సంవత్సరాలు అద్దెకు తీసుకుని (రెంటుకు) ఉన్నా సరే, అద్దెదారులు ఆ ఆస్తిపై చట్టపరమైన యజమానులు కాలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘ది లిమిటేషన్ యాక్ట్–1963’ (The Limitation Act – 1963) ప్రకారం 12 ఏళ్లకు పైగా ఒక ఇల్లు లేదా ఆస్తిలో నివసించినప్పటికీ, ఆ ఆస్తిపై హక్కును పొందే అవకాశం లేదని అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో వెల్లడించింది.

అద్దెదారులు ఆస్తిని కలిగి ఉన్నప్పటికీ, వారు యజమాని అనుమతితో ఆస్తిని కలిగి ఉన్న ‘అనుమతి పొందిన ఆక్రమణదారులు’ (Permissive Possessors) కిందకే వస్తారు. ఈ చట్టం కింద ఆస్తి యాజమాన్య హక్కులను అద్దెదారులు పొందాలంటే, యజమాని అనుమతి లేకుండా, బహిరంగంగా, ఆస్తి యజమానికి వ్యతిరేకంగా (Adverse Possession) ఆ ఆస్తిని 12 ఏళ్లు నిరాటంకంగా ఆక్రమించుకుని ఉండాలి.

సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ కీలక తీర్పుతో, దీర్ఘకాలంగా కొనసాగుతున్న చట్టపరమైన గందరగోళానికి ముగింపు పలికినట్లయింది. అద్దెదారుల యాజమాన్య హక్కులపై వస్తున్న వివాదాలకు చెక్ పడుతుందని భావిస్తున్నారు. ఈ తీర్పు ఆస్తి యజమానుల హక్కులను కాపాడుతూ, వారి ఆస్తిపై ఉన్న చట్టపరమైన నియంత్రణను బలోపేతం చేసింది.

 

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |