‘కేజీఎఫ్’ సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ సృష్టించిన కన్నడ స్టార్ హీరో యష్ ప్రస్తుతం నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ (Toxic Movie). ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. యష్ కెరీర్‌లో 19వ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవీన్‌ఎన్ ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మార్చి 19, 2026 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, షూటింగ్ ఆలస్యం అవుతుందనే కారణంగా సినిమా విడుదల తేదీ వాయిదా పడబోతుందంటూ ఇటీవల కొన్ని వార్తలు (రూమర్స్) వచ్చాయి. ఈ పుకార్లపై ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ నిర్మాతలను సంప్రదించడంతో, వారు విడుదల తేదీపై స్పష్టత ఇచ్చారు.
సినిమా రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు లేదని నిర్మాతలు ప్రకటించారు. మునుపటి ప్రకటన ప్రకారం మార్చి 19, 2026కే సినిమా విడుదల అవుతుందని స్పష్టం చేస్తూ రూమర్స్‌కు చెక్ పెట్టారు. ఈ చిత్రంలో కియార అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.









