భారీ బడ్జెట్ సినిమాలు ఏడాదికి 2, 3 దింపుతున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ‘ఫౌజీ’ (Fauji) సినిమా షూటింగ్‌తో బిజీగా గడుపుతున్నాడు. పీరియాడిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై ఆడియెన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు ‘ఫౌజీ’ (సైనికుడు) అనే టైటిల్‌ను మేకర్స్ రిజిస్టర్ చేయించారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ప్రభాస్ మరో ప్రాజెక్ట్ అయిన “ది రాజా సాబ్” సినిమా షూట్‌తో పాటు సమాంతరంగా సాగుతోంది. రెండు ప్రాజెక్టులు ఒకేసారి నిర్వహిస్తున్నప్పటికీ, ప్రభాస్ తన డెడికేషన్‌తో సమర్థంగా బ్యాలెన్స్ చేస్తున్నారు.
తాజాగా ఈ పీరియాడిక్ చిత్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను మేకర్స్ దీపావళి సందర్భంగా ప్రకటించారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 22న ఈ సినిమా గ్లింప్స్ లేదంటే టీజర్ లాంటివి రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. #ప్రభాస్ హను డిక్రిప్షన్ 22.10.25న ప్రారంభమవుతుందంటూ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘సీతారామం’ లాంటి అద్భుతమైన పీరియడ్ లవ్ స్టోరీని తెరకెక్కించిన హను రాఘవపూడి, ఈసారి ప్రభాస్‌లోని మాస్, క్లాస్, గ్రేస్‌ను ఎలా బ్యాలెన్స్ చేశారో చూడాలని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఈ పీరియాడిక్ డ్రామా కథ 1940ల నాటి నేపథ్యంతో రూపొందుతుందన్న టాక్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రేమ, త్యాగం, దేశభక్తి, మరియు మానవ సంబంధాల మేళవింపుగా ఈ కథ ఉంటుందని సమాచారం. హను రాఘవపూడి స్టైల్‌లో క్లాసిక్ లవ్ ఎలిమెంట్స్‌తో కూడిన విజువల్ గ్రాండర్ ఈ సినిమా ప్రత్యేకతగా నిలవనుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ ఇమాన్వి ప్రభాస్ సరసన నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.









