UPDATES  

NEWS

 మలయాళ దర్శకుడికి మల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్..? మరో కొత్త ప్రయోగం..?

పుష్ప(Pushpa) తరువాత అల్లు అర్జున్‌ చేయబోయే సినిమాల గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పాన్‌ ఇండియా రేంజ్‌లో ఆదరణ ఉండటంతో ప్రస్తుతం కథల ఎంపిక విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) తో ఒక సినిమాను పట్టాలెక్కించాడు. త్రివిక్రమ్(Trivikram) సినిమాను దాదాపు పక్కన పెట్టేసినట్లే అని చెప్పవచ్చు. అయితే, ఇప్పటికే బన్నీ లిస్ట్‌లో ప్రశాంత్‌ నీల్‌ ఉన్నారు. ఆయనతో ఒక ప్రాజెక్ట్‌ తప్పకుండా చేస్తారని టాక్‌ ఉంది. ఇంతలో ఎవరూ ఊహించలేని ఒక దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. అట్లీ సినిమా తర్వాత తన దర్శకత్వంలోనే బన్నీ సినిమా అంటూ పెద్ద ఎత్తున్న వైరల్‌ అవుతుంది.

 

 

అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్‌ ఎవరూ ఊహించలేని దర్శకుడితో సినిమా ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కథ కూడా బన్నీ ఓకే చేశారట. మలయాళ హిట్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్(Basil Joseph)తో బన్నీ సినిమా దాదాపు ఖరారు అయిపోయిందట. మలయాళంలో డైరెక్టర్‌గానే కాకుండా నటుడిగా కూడా ఆయన సంచలన విజయాలను అందుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘మిన్నల్ మురళీ’ (2021) చిత్రానికి తెలుగులో కూడా ఫ్యాన్స్‌ ఉన్నారు. అయితే, దర్శకుడిగా ఆయన మూడు చిత్రాలకే పనిచేశారు. స్టోరీ రచయితగా పలు సినిమాలకు పనిచేశారు. జయ జయ జయ జయహే, సూక్ష్మ దర్శిని, పోన్ మాన్ వంటి సినిమాలతో ఆయన తెలుగు వారికి నటుడిగా బాగా దగ్గరయ్యాడు. కేవలం మూడు సినిమాలకు దర్శకుడిగా పనిచేసిన బాసిల్ జోసెఫ్‌తో బన్నీ సినిమా చేస్తున్నట్లు వార్తలు రావడంతో నెట్టింట భారీగా వైరల్‌ అవుతుంది.

 

ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో బన్నీ వాస్‌ ఒక సినిమా గురించి మాట్లాడారు. మరో నాలుగు నెలలో గీతా ఆర్ట్స్ నుంచి ఒక పెద్ద ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తామన్నారు. అదే సమయంలో త్రివిక్రమ్ మూవీ కాదని కూడా తెలిపాడు. ఎవరూ ఊహించలేని కాంబినేషన్‌ అని ఆయన అన్నాడు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. మలయాళంలో అల్లు అర్జున్‌కు భారీ ఇమేజ్‌ ఉంది. దీంతో ఆయన మీద అభిమానంతో దాదాపు నాలుగేళ్లు కష్టపడి ఒక కథను బాసిల్‌ రెడీ చేశారట. త్వరలో అధికారికంగా ప్రకటన ఉంటుందని సమాచారం.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |