గురుకులాలు, హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఆహార నాణ్యతను పరిశీలించేందుకు తెలంగాణ ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఇటీవల గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ కేసులు వెలుగు చూశాయి. ఈ ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలను టాస్క్‌ఫోర్స్ తేల్చనుంది.
ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారితో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలను తేల్చి, బాధ్యులను గుర్తించనుంది.
పాఠశాల ఫుడ్ సేఫ్టీ కమిటీలో సంబంధిత పాఠశాల హెడ్ మాస్టర్, ఇద్దరు పాఠశాల సిబ్బంది ఉంటారని తెలంగాణ సీఎస్ జారీ చేసిన ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వంట చేసే ముందు కిచెన్‌ను పరిశీలించి పరిశుభ్రతను నిర్ధారించాల్సి ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ కమిటీ రుచి చూశాకే విద్యార్థులకు ఆహారం వడ్డించాలి. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.