కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన సినిమా దేవర. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. త్రిబుల్ ఆర్ వంటి పాన్ ఇండియా సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి ఈ సినిమా రావడం, అలానే ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఈ సినిమా చేయడంతో ఒక్కసారిగా ఈ సినిమా పైన అందరికీ క్యూరియాసిటీ పెరిగింది. దీనికి తోడు రాజమౌళి హీరోల సెంటిమెంట్ కూడా యాడ్ అయింది. కాగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
సముద్రానికి చేరువుగా ఒక కొండ ప్రాంతంలో ఉండే ఒక నాలుగు గ్రామాలు. ఆ నాలుగు గ్రామాల్లో ఉండే నలుగురు ప్రముఖ వ్యక్తులు, సముద్ర మార్గం గుండా కొన్ని కొన్ని కంటైనర్లను అక్రమంగా తరలిస్తూ ఉంటారు. వాటిలో ఈ సమాజానికి హాని కలిగించే మారణాయుధాలు ఉన్నాయని వాళ్ళకి తెలియదు. అలా అక్రమంగా వాటిని తరలించడం వలన ఆ నాలుగు గ్రామాలకు జరిగిన విపత్తులేంటి.? అసలు కంటైనర్లను అలా అక్రమంగా తరలించవలసిన అవసరం ఏంటి.? వాళ్లు తరలిస్తున్న కంటైనర్లులో మారణాయుధాలు ఉన్నాయి అని తెలిసిన తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటి.? వీటిలో దేవర పాత్ర ఏంటి.? ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.