UPDATES  

NEWS

 భారత్ సరిహద్దుల్లో పెరుగుతున్న ఉగ్రవాదుల చర్యలు..

జమ్మూ కాశ్మీర్ వద్ద భారత సరిహద్దుల్లో ఇటీవల ఉగ్రవాద చర్యలు పెరుగుతున్నాయి. ఉగ్రవాదులు భారత భూభాగంలో చొరబడేందుకు వారికి పాకిస్తాన్ ఆర్థికంగా సహాయం చేస్తోందని ఇంటెలిజెన్స్ రహస్య నివేదికలో వివరాలున్నాయని ఓ సినియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. భారత్ సరిహద్దులకు సమీపంలో టెర్రరిస్టు క్యాంపులు కూడా పాకిస్తాన్ అండదండలతోనే నడుస్తున్నాయని చెప్పారు.

 

జమ్మూ కాశ్మీర్ లోని దోడా జిల్లాలో మంగళవారం.. భారత సైన్యం, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు సైనికులు చనిపోయారు. వీరిలో ముగ్గురు జవాన్లు కాగా.. ఒకరు ఆఫీసర్. కాల్పులు జరిపిన ఉగ్రవాదుల వద్ద బాంబులు, అడ్వాన్స్ డ్ తుపాకీలు ఉన్నట్లు తెలిసింది. అంతకుముందు కశ్మీర్ కఠువా జిల్లా సరిహద్దుల వద్ద మాచెడీ అడవుల్లో పెట్రోలింగ్ చేస్తున్న ఆర్మీ సిబ్బందిపై ఒక్కసారిగా ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో అయిదుగురు సైనికులు మృతి చెందారు, 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.

 

టెర్రరిస్టుల వెనుక పాకిస్తాన్?

భారత ప్రభుత్వానికి అందిన రహస్య సమాచారం ప్రకారం.. పాకిస్తాన్ మిలిటరీలో పని చేసిన మాజీ స్పెషల్ సర్వీస్ గ్రూప్ సభ్యులు ఉగ్రవాదులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. భారత సరిహద్దుల్లో చొరబడేందుకు ప్రతి ఉగ్రవాదికి లక్ష రూపాయలు ఇస్తున్నారు. ఉగ్రవాదులకు ఖరీదైన M4 తొపాకులు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను సైతం ఛేదించగలిగే చైనా బుల్లెట్లు.. పాకిస్తాన్ నుంచి అందుతున్నాయి. ఉగ్రవాదులకు భారత సరిహద్దుల వద్దకు తీసుకెళ్లేందుకు సహాయం చేసే గైడ్ లకు రూ.10000 నుంచి రూ.50000 పాకిస్తాన్ ఆర్మీ చెల్లిస్తోంది. పైగా ఉగ్రవాదులు తమను సంప్రదించడానికి ప్రత్యేకమైన సామ్ సంగ్ మొబైల్ ఫోన్స్, వై ఎస్ ఎం ఎస్ ఐ కామ్ రేడియ్ సెట్లు సరఫరా చేస్తోంది.

 

ఉగ్రవాదులను అడ్డుకునేందుకు భారత్ సైన్యంలోని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సరిహద్దుల్లోని ప్రతి టన్నెల్, ఫెన్సింగ్ చేసిన అడవి ప్రాంతాల వద్ద భద్రత చర్యలు చేపట్టారు. టెర్రరిస్టులకు ఒకరోజు భోజన, వసతి సదుపాయాలు సమకూర్చేందుకు కాశ్మీర్ నివాసులకు పాకిస్తాన్ రూ.5000 నుంచి రూ.6000 చెల్లిస్తోందని సమాచారం.

 

గతంలో యువతను మతం పేరుతో రెచ్చగొట్టి ఉగ్రవాదులుగా మార్చే పాకిస్తాన్ ఆర్మీకి ఇప్పుడు అలా కుదరడం లేదు. మతం పేరు చెబితే భ్రమించే యువత ఇప్పుడు పాకిస్తాన్ సైన్యానికి దొరకడం లేదు. దీంతో పాకిస్తాన్ ఉగ్రవాదులుగా మారితే డబ్బులు చెల్లిస్తామంటూ సరిహద్దు ప్రాంతాల యువతను ప్రలోభ పెడుతోందని రహస్య నివేదికలో వివరాలున్నాయి.

 

గత రెండు నెలలుగా పాకిస్తాన్ భూభాగంలో సరిహద్దుల్లోని నికియాల్, జాన్ ద్రుత్, ఖుర్రేట్టా, కోట్లీ, సమానీ, అబ్దుల్ బిన్ మసూద్, సమాన్, కోట్ కుటేరా ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాల్లో పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తున్నారని తెలిసింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |