UPDATES  

NEWS

 అమరావతిపై ఢిల్లీ బిగ్ అప్డేట్..!

అమరావతిపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. రాజధాని పనులు వేగవంతం చేయాలని నిర్ణయించింది. కేంద్రానికి సీఎం చంద్రబాబు తాజా ప్రతిపాదనలు అందించారు. కేంద్రం నుంచి సానుకూలత వ్యక్తం అవుతోంది. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించే వేళ ఏపీకి కీలక సమాచారం అందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి కోసం ప్రతిపాదించిన అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టకు కేటాయింపులు చేయనున్నట్లు సమాచారం. దీంతో, సీఆర్డీఏ కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

 

కొత్త ప్రణాళికలతో అమరావతి కేంద్రంగా సీఆర్డీఏ కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. రాజధానిలోకి ప్రవేశించడానికి గ్రాండ్‌ ఎంట్రన్స్‌గా ఉన్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు సమాంతరంగా మరో రెండు రోడ్లను కూడా ఇదే స్థాయిలో అభివృద్ధి చేసి 16వ నంబర్‌ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-16)కి అనుసంధానం చేయాలని సీఆర్‌డీఏ అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రణాళికలు శరవేగంగా సిద్ధం చేస్తున్నారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు సమాంతరంగా ఉండే ఈ-11, ఈ-13 రోడ్లను కూడా జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నారు.

 

కేంద్రం హామీ ఈ రెండు రోడ్లను అమరావతిలో వెంకటపాలెం వరకు నిర్మించారు. వీటిని విస్తరించి జాతీయ రహదారికి కలుపుతారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు కూడా వెంకటపాలెం దగ్గర వరకు వచ్చి ఆగింది. ఇక్కడి నుంచి మణిపాల్‌ హాస్పిటల్‌ పక్క నుంచి కనకదుర్గ వారధి దిగువున ఎన్‌హెచ్‌-16కు కలపాల్సి ఉంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. అమరావతి రాజధానిపై దృష్టి సారించింది. ఉండవల్లి మండలంలోని పెనుమాక దగ్గర నుంచి జాతీయ రహదారి వరకు 3 కిలోమీటర్ల మేర 30 ఎకరాల వరకు భూముల అవసరం ఏర్పడింది. సమీకరణ కింద రైతులు ఇస్తే తీసుకోవటానికి సీఆర్‌డీఏ సిద్ధంగా ఉంది.

 

గేమ్ ఛేంజర్ గా ఒకవేళ పూలింగ్‌ కింద సాధ్యం కాకపోతే భూ సేకరణ చేసైనా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. త్వరలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు బ్యాలెన్స్‌ పనులకు అడుగులు పడతాయనుకున్న దశలో సీఆర్‌డీఏ దానితోపాటు ఈ-11, ఈ-13 రోడ్లను కూడా ఎన్‌హెచ్‌-16 అనుసంధానించాలని నిర్ణయించారు. ఇప్పటికే అమరావతి ఓఆర్‌ఆర్‌కు అనేక జాతీయ రహదారులు అనుసంధానమవుతున్నాయి. ఎన్‌హెచ్‌- 16, ఎన్‌హెచ్‌-65, ఎన్‌హెచ్‌-30, ఎన్‌హెచ్‌-216, ఎన్‌హెచ్‌-216 హెచ్‌ ఇలా ఎన్నో రోడ్లు ఇందులో ఉన్నాయి. అన్నింటికంటే ప్రధానమైన నాగ్‌పూర్‌-విజయవాడ ఎకనమిక్‌ కారిడార్‌, బెంగళూరు-విజయవాడ ఎకనమిక్‌ కారిడార్‌లు అనుసంధానం కానున్నాయి. దీని కారణంగా రాజధానికి విస్తృతమై రోడ్డు నెట్‌వర్క్‌తో గేమ్ ఛేంజర్ కానుంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |