మహిళలపై వేధింపులు సమాజంలో అన్నిచోట్లా ఉన్నాయి.. కానీ ఇండస్ట్రీలో ఇది కొంత ఎక్కువగా కనిపిస్తుందని ప్రముఖ సింగర్ నోయెల్ భార్య, నటి ఎస్తర్ నోరాన్హా చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీలో తొందరగా ఎదగాలనే కోరికతో ఏం చేయడానికైనా సిద్ధపడితే అడ్వాంటేజ్ తీసుకుంటారని చెప్పారు. తొందరగా పైకి రావాలని కోరుకునే వారికి అదే షార్ట్ కట్ అని అన్నారు.
ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు ఎక్కువగా జరగడానికి కారణం ఇక్కడున్న పరిస్థితులేనని ఎస్తర్ వివరించారు. అవకాశాల కోసం ఏం చేయగలవు అనే వాళ్లు, అడ్వాంటేజ్ తీసుకునే వాళ్లు ఉంటారని తెలిపారు. నేనలా చేయలేను, నా దారిలో నేను వెళతాను అనుకునే వారిని ఎవరూ బలవంత పెట్టరని, ఆ ఛాయిస్ మాత్రం ఉందని తెలిపారు. తన వరకు తను టాలెంట్ ను, హార్డ్ వర్క్ ను నమ్ముకుంటానని ఎస్తర్ చెప్పారు. తన టాలెంట్ ద్వారా వచ్చే గుర్తింపునే కోరుకుంటానని స్పష్టం చేశారు.
Post Views: 47