UPDATES  

NEWS

 ఏపీలో న్యూస్‌ఛానెల్స్‌ ప్రసారాలను తక్షణం పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం..!

ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై NBF హర్షం వ్యక్తం చేసింది. ట్రాయ్‌ నిబంధనల ప్రకారం ఛానల్స్‌ ప్రసారాలను నిలిపివేయడం చట్టవిరుద్ధం NBF తెలిపింది.

 

  • భవిష్యత్‌లోనూ ఛానెల్స్ ప్రసారాలను అడ్డుకోకుండా
  • ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకోవాలని
  • న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ ఫెడరేషన్‌(NBF) వెల్లడించింది.

 

  •    ఇద్దరి MSOల కుట్ర

15 రోజుల క్రితం విజయవాడ లో MSO లు మీటింగ్ పెట్టుకుని, ప్రభుత్వం దగ్గరకు వెళ్లి ఏపీ ఫైబర్ లో IP TV తీసివేస్తే, మేము డిజిటల్ సెట్ ఆఫ్ బాక్స్ ద్వారా చానల్స్ ఇస్తున్నాము, మీరు నెట్ ఒకటి ఇవ్వండి చాలు, మేము ఏపీ ఫైబర్ ను ముందుకు తీసుకుని వెళతాము అని చెప్పాలని ప్లాన్ చేసుకున్నారు, అందులో భాగంగా ఆ నాలుగు చానల్స్ తీసివసి వెళితేనే మనలను పట్టించుకుంటారు అనే దురుద్దేశంతో ఆ నాలుగు చానల్స్ వారే ఆపేసారు, ఏపీ ఫైబర్ ను టిడిపి అభివృద్ధి చేస్తే వారి కనెక్టివిటీ పోతుందని అనే స్వార్థంతో MSO లు వున్నారు, మామూలుగా అయితే కనెక్టివిటీ కోసం ఒకరి గ్రౌండ్లోకి ఒకరు వెళ్ళే మన MSO లు, వారికి నష్టం వస్తుంది అని అనుకున్న వెంటనే వారందరూ ఒకటై పోయారు, కాని వారు DTH ల వలన ఆపరేటర్లు నష్టపోతున్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా, అసలు MSO లు అనేవారు ఏనాడైనా ఆపరేర్లతో మీటింగ్ లు పెట్టి మన కష్టసుఖాలు గురించి అడిగారా , ఎందుకు అంటే మన ఆపరేటర్లు నేనే తోపు అని కొంతమంది, నా అసోసియేషన్ గొప్పది అని ఇలా అందరూ కలవడం లేదు,సమస్య వచ్చిన మరుక్షణం అందరూ కలిసి ఒక ఎజెండా తో ముందుకు వెళ్ళాలనే ఆలోచన రావడం లేదు,ఈ లోపం ఎవరిది, ఆపరేటర్లదా ? , యూనియన్ నాయకులదా? , అసలు కేబుల్ వ్యాపారం వుంటే వుంటుంది లేకపోతే పోని అని చాలామంది ఆపరేటర్ల అలసత్వమా? ,మరి కొత్తగా ఎవరూ మన గ్రామాలలో కేబుల్ వ్యాపారం చేయకూడదు అని గగ్గోలు పెడతాము, అలా అనుకున్నప్పుడు మనకు సమస్య వచ్చిన వెంటనే ఆయా MSO సిగ్నల్ లో వున్న ఆపరేటర్లు వెంటనే వెళ్ళి MSO ను ఎందుకు అడగడం లేదు, ఇలా గ్రూప్ లో చానల్స్ ఆపివేసారని మెసేజ్ పెట్టడం వలనే ఏమైనా ప్రయోజనం వుంటుందా? , గ్రూప్ లో పెట్టడం అంటే కేవలం బాధను చెప్పుకోవడం వరకే పరిష్కారం మాత్రం మన చేతుల్లోనే వుంటుంది

సీతారామయ్య, కేబుల్ ఆపరేటర్ల నాయకుడు.

 

  • యంయస్ఓలు నిద్రమత్తు వీడండి

 

  • ప్రభుత్వాలపై వార్త పత్రికలు వార్త ఛానెళ్లు వ్యతిరేకంగా వార్త రాస్తే ఆ ఛానల్ ఆ రాష్ట్రంలో నిషేధం
  • మరి DTH ల మాటేమిటి? DTH లు ఆరాష్ట్రంలో ఆఛానళ్ళును నిషేదించరా?
  • DTH లో ఛానెళ్లు నిరాటంకంగా నడుస్తూనే వుంటాయి ఎందుకంటే అవి కార్పొరేట్ సంస్థలు కాబట్టి
  • మరి కేబుల్ టీవీ యంయస్ఓలు ప్రభుత్వం చెప్పగానే ఎందుకు ఆపు చున్నారు
  • ఆంధ్రాలో ప్రభుత్వం మారినప్పుడల్లా ఛానళ్ళు నిషేధించడం పరిపాటి అయిపోయింది .
  • మరి ఈసారి ఆంధ్ర లో ప్రభుత్వం మారితే తెలంగాణ యంయస్ఓలు ఎందుకు భయపడటం? టీవీ కనెక్షన్లు పోతే లోకల్ ఆపరేటర్లవే కదా అనా?
  • వేల మంది కేబుల్ ఆపరేటర్లు బలం వున్న యంయస్ఓలు ప్రభుత్వం చెప్పగానే ఛానళ్ళు నిషేధిస్తారు.కేవలం కొద్ది మంది వున్న కార్పొరేట్ సంస్థలు నిషేధించరు ఎందుకని?
  • ఇప్పటికైనా యంయస్ఓలు తమ తప్పు తెలుసుకొని నిలదీయండి DTH లో కూడా నిషేదిస్తేనే మేము నిషేధిస్తామని

 

,సత్యనారాయణ, ఆపరేటర్

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |