UPDATES  

NEWS

 అడకత్తెర్లో కేబుల్ ఆపరేటర్లు..!

తెలుగుదేశం పార్టీ అధినాయకులు, తాము కక్ష సాధింపు చర్యలకు దూరమని చెబుతూ కలగ చేసుకోకపోయినా కొంతమంది నాయకుల ద్వారా సాక్షి, టీవీ 9 ,ఎన్టీవీ , చానల్స్ ఆపివేయాల్సిందిగా ఆదేశింప చేశారు

 

పార్టీ కలగజేసుకోకపోయినా రాజధాని ప్రాంతానికి చెందిన ఎం.యస్.ఓ అధికార పార్టీలో తన పరపతిని పెంచుకోవటానికి తన రాజకీయ స్వార్థం కోసం ముందుగానే చానల్స్ ఆపివేసి తెలుగుదేశం నాయకులతో మిగతా M.S.O లు చానల్స్ ను ఆపించారు, రాజకీయ ప్రయోజనాల కోసం ఆపరేటర్లను బలి పశువులు చేస్తున్నారు వైయస్సార్ ప్రభుత్వంలో ఏబీఎన్ ,టీవీ 5 ఆపివేయమన్నారు కానీ అలా కార్టేలో పెట్టినా వారు ఏమీ మాట్లాడలేదు కొందరు ఆపరేటర్లు అసలు ఆపలేదు ఆపరేటర్ల సమస్యలను తాము తీరుస్తామని కూడా ఆ ప్రభుత్వం చెప్పింది అయినా కొంతమంది ఆపకుండా ఉన్నారు ,ఏదైనా ప్రభుత్వము ఒక పరిశ్రమ నాయకులను పిలిచి తమకు ఇలా కావాలి అంటే పరిశ్రమ సమస్యలని మీరు పరిష్కారము చూపితే మీరు చెప్పింది చేయడానికి మేము సిద్ధము అని చెప్తారు కానీ ఇక్కడ ఏ విధమైన సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా మీరు ఈ విధంగా చేయడం ఏ విధమైన న్యాయమని ఆపరేటర్లు అడుగుతున్నారు కేబుల్ పరిశ్రమ ఏ ప్రభుత్వం వచ్చినా వారికే అనుకూలంగానే ఉన్నారు పరిశ్రమ నాయకులని చెప్పుకునేవారు తమ స్వార్థ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు మూడు చానల్స్ పూర్తిగా ఆగితే ఆర్థికంగా దెబ్బతినేది ఆపరేటర్లు మాత్రమే ఇంటర్నెట్, డిజిటలైజేషన్ ,DTH వల్ల కేబుల్ ఆపరేటర్ల బతుకులు చిన్నాభిన్నమైనాయి కేబుల్లో చానల్స్ లేకపోయినా డిటిహెచ్ లో చానల్స్ వస్తున్నాయి కస్టమర్ డిటిహెచ్ వైపు మొగ్గు చూపుతాడు ఆపరేటర్లకు కనెక్షన్లు తగ్గుతాయి కస్టమర్లతో కూడా ఆపరేటర్లు మాత్రమే చివాట్లు తింటున్నారు ఎం ఎస్ ఓ లు చానల్స్ ను అలా కర్టే లో పెడితే అటు ప్రభుత్వ మాట వినినట్టు ఉంటుంది ఇట కేబుల్ ఆపరేటర్లకు కొంత వెసులుబాటు ఉంటుంది ఆ విధంగా కేబుల్ పరిశ్రమ ఆలోచించాల్సిగా కోరుతోంది

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |