UPDATES  

NEWS

 పుష్ప-2 సినిమా రిలీజ్ వాయిదా.. కారణం అదేనా..?

పుష్ప-2 సినిమా యూనిట్ తాజాగా ప్రకటన చేసింది. సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా కొత్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించింది. 2024, డిసెంబర్ 6న ఈ సినిమాను భారీ ఎత్తున పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటనను రిలీజ్ చేసింది. అంతేకాదు పుష్ప సక్సెస్ తరువాత పుష్ప-2 సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఎదురుచూపులే తమ మీద బాధ్యతను పెంచాయంటూ సినిమా యూనిట్ స్పష్టం చేసింది. ముందుగా ప్రకటించినవిధంగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్రయత్నం చేశాము కానీ, ఇంకా షూట్ మిగిలి ఉండడంతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పనికి కూడా సమయం పడుతూ ఉండడం వల్ల ఆగస్టు 15న పుష్ప-2ను రిలీజ్ చేయలేకపోతున్నామని తెలిపింది.

 

ఈ నిర్ణయాన్ని ప్రేక్షకులతోపాటు అందరి అభిప్రాయాల మేరకే తీసుకున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది. క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా బిగ్ స్క్రీన్ మీద ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసం వాయిదా వేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పాటలకు అన్ని భాషలలో మంచి రెస్పాన్స్ వస్తున్నదని, ఈ క్రమంలోనే క్వాలిటీలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వాలనుకోవడంలేదంటూ అందులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. పుష్ప-2 రిలీజ్ డేట్ మారడంతో తెలుగు సినీ పరిశ్రమలో చాలా సినిమాలు విడుదల తేదీలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |