UPDATES  

NEWS

 ఏపీ ఉద్యోగుల పీఆర్సీలో కీలక పరిణామం..

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. నూతన ప్రభుత్వం పైన ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. జగన్ ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఉద్యోగులు ఏకపక్షంగా కూటమికి మద్దతుగా నిలిచారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొనే సమయంలో ఉద్యోగులు భారీ స్వాగతం పలికారు. పెండింగ్ బకాయిలతో పాటుగా పీఆర్సీ గురించి కొత్త ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశతో ఉన్నారు. ఈ సమయంలో నే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

 

ఉద్యోగుల ఆగ్రహంతో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగులు అసహనంతో కనిపించారు. ఉద్యోగుల పీఆర్సీ అమలులో అనుసరించిన విధానం..కొర్రీలు వారికి ఆగ్రహం తెప్పించాయి. 2022లోనే విజయవాడలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏలు సకాలంలో అందలేదు. ఉద్యోగుల ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ ఖాతాల్లోని నిధులను నాటి ప్రభుత్వం వినియోగించుకుంది. ఇక..పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు దక్కాల్సినవి దక్కలేదు. అదే విధంగా పెన్షనర్ల విషయంలోనూ ప్రభుత్వ నిర్ణయాల పైన వ్యతిరేకత కనిపించింది.

మన్మోహన్ రాజీనామా తాజా ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ తో పాటుగా పోలింగ్ లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరంతా వ్యవహరించినట్లు ఎన్నికల సరళి స్పష్టం చేసింది. ఇక..ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తరువాత ఉద్యోగ సంఘాల నేతలు కలిసారు. తమ బకాయిలు చెల్లించటంతో పాటుగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెలాఖరులోగా సమావేశం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇదే సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ ప్రభుత్వ హాయంలో నియమించిన 12వ వేతన సంఘం కమిషనర్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేసారు.

 

ప్రభుత్వ నిర్ణయం పై పీఆర్సీ కమిషనర్ గా తనను నియమించినా.. సిబ్బందిని కేటాయించలేదు. దీంతో పాటుగా తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రభుత్వానికి మన్మోహన్ లేఖ రాసారు. దీంతో..ఇప్పుడు ప్రభుత్వం కొత్త పీఆర్సీ ఏర్పాటు చేయాల్సి ఉంది. పీఆర్సీ నివేదిక ఆలస్యం కానుండటంతో ప్రభుత్వం ఉద్యోగులకు ఐఆర్ ఇస్తుందా లేదా..ఎంత మేర ప్రకటిస్తారనేది ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో చర్చగా మారింది. ఇక..నూతన పీఆర్సీని హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాల జేఏసీ కోరుతోంది. దీంతో..ఇప్పుడు ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఏంటనేది ఆసక్తిగా మారుతోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |