దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక, తెలంగాణ రాష్ట్రానికి పూర్తి స్థాయి గవర్నర్ను నియమించే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం.
సివిల్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్, ఫుడ్ కార్పొరేషన్ శాఖ మాజీ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబేను తెలంగాణ కొత్త గవర్నర్గా నియమించే అవకాశాలున్నాయని సమాచారం. కాగా, ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు, నమ్మదగిన వ్యక్తి అనే పేరున్న అశ్వినీ కుమార్ చౌబే గత ప్రభుత్వంలో మోడీ కేబినెట్లో సహాయ మంత్రిగా పనిచేశారు.
1953 జనవరిలో బీహార్ రాష్ట్రంలో జన్మించిన అశ్వినీ కుమార్ చౌబే ఆ రాష్ట్ర రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. అయితే, తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహరచన అయోధ్య రామ మందిరం నిర్మాణ ప్రక్రియలో కూడా అవ్వినీ కుమార్ కీలక పాత్ర పోషించారు.
తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ శాయశక్తులా ప్రయత్నాలు చేసింది. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తర్వాత మూడో స్థానంలోనే బీజేపీ ఉండిపోయింది. కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలే వచ్చాయి. గతంలో నలుగురు ఎంపీలే ఉండగా.. ఇప్పుడు ఎనిమిది మందికి పెరిగారు.
కాగా, ప్రస్తుతం ఇంఛార్జీ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ స్థానంలో ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడైన అశ్వినీ కుమార్ చౌబే పేరు. గవర్నర్ గా పంపించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మరోవైపు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా తెలంగాణ గవర్నర్ పదవి కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే, ఆయనను కర్ణాటక గవర్నర్గా నియమించే అవకాశాలున్నట్లు తెలిసింది.