UPDATES  

NEWS

 సచివాలయంలో సీఎం గా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు..!

ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు నేడు అమరావతిలోని సచివాలయంలో సీఎం గా బాధ్యతలు చేపట్టారు. సీఎంగా రాజధాని అమరావతికి చంద్రబాబు వచ్చిన క్రమంలో అమరావతి ప్రాంత రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సుదీర్ఘ పోరాటం తర్వాత అమరావతి ప్రాంత రైతుల కల నెరవేరింది.

 

రాజధాని అమరావతి కోసం పోరాటం చేసిన రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ఓటమిపాలై, టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగుతుందని చంద్రబాబు చేసిన ప్రకటనతో అమరావతి ప్రాంత రైతుల సుదీర్ఘ పోరాటానికి ఎండ్ కార్డు పడింది. గత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ప్రభుత్వంతో పోరాటమే చేశారు అమరావతి ప్రాంత రైతులు.

చంద్రబాబు సీఎం కావటంతో అమరావతి రైతుల్లో ఆనందం ఎంతోమంది రైతులు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. గత ప్రభుత్వం రాజధాని అమరావతి ఉద్యమాన్ని అణిచివేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, మొక్కవోని దీక్షతో అమరావతి ఉద్యమాన్ని కొనసాగించిన రైతులు ప్రస్తుతం ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో సంతోషంలో మునిగి తేలుతున్నారు.

 

టన్నుల కొద్దీ పూలతో చంద్రబాబుకు ఘన స్వాగతం రాజధాని అమరావతిని ప్రపంచం మొత్తం తలతిప్పి చూసేలా అభివృద్ధి చేస్తానని చంద్రబాబు చేసిన ప్రకటన, అమరావతిని శుభ్రం చేసి, విద్యుత్ దీపాలతో మళ్ళీ వెలుగులు విరజిమ్మేలా చేసిన చంద్రబాబు తమ జీవితాలలో కాంతిని నింపేందుకు వస్తున్నారని భావించిన రాజధాని అమరావతి ప్రాంత రైతులు టన్నులకొద్దీ పూలను సిద్ధం చేసి ఘన స్వాగతం పలికారు.

 

మానవహారం… పూలతో ఘన స్వాగతం నేడు ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని, ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గమ్మని దర్శించుకొని, ఏపీ సచివాలయంలో సీఎం గా బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన చంద్రబాబుకు మానవహారంగా నిలబడి, టన్నుల కొద్ది పూలతో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు రాజధాని రైతులు.

 

సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు సెక్రటేరియట్ వరకు కాన్వాయ్ తో వస్తున్న చంద్రబాబుకు పూలు చల్లుతూ స్వాగతించారు. నేడు బాధ్యతలు స్వీకరించడానికి సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికారు ఉద్యోగులు. మరోవైపు చంద్రబాబు సచివాలయానికి రావడానికి ముందే సీఎం ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు 4 గంటల 41 నిమిషాలకు సచివాలయంలో సీఎంగా బాధ్యతలను చేపట్టారు చంద్రబాబు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |