UPDATES  

NEWS

 కాన్యాయ్ లతో కల్కి మాస్ ప్రమోషన్స్..!

ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి ఒక లెక్క.. కల్కి ప్రమోషన్స్ మొదలయ్యాయి. సినిమాలు తీయడం అందరికి తెలుసు.. కానీ, పాన్ ఇండియా లెవెల్లో ప్రమోట్ చేయడం కొంతమందికే తెలుసు. ఆ కొంతమందిలో నాగ్ అశ్విన్ ఒకడు. బక్కగా ఉన్నాడు. సింపుల్ గా కనిపిస్తాడు అని తక్కువ అంచనా వేయడానికి లేదు. బుర్ర నిండా ఆలోచనలే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

 

నాగి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కల్కి2898AD. ప్రభాస్ హీరోగా, దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఎన్నో వాయిదాల తరువాత జూన్ 27 న కల్కి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే కల్కి నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా మంచి హైప్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి.

 

అసలు ఇది తెలుగు సినిమానా.. ? ఇంగ్లిష్ సినిమానా అనే డౌట్ వచ్చింది అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. మరి అలాంటి సినిమాకు ప్రమోషన్స్ అంటే ఎలా ఉండాలి.. కచ్చితంగా ఇలాగే ఉండాలి. ఇప్పటికే బుజ్జితో కల్కికి ఓ రేంజ్ లో హైప్ తీసుకొచ్చి వదిలారు. ఇప్పుడు మునుపెన్నడూ లేనివిధంగా కల్కి కాన్వాయ్ ను దింపారు. పొలిటీషియన్స్ కు కాన్వాయ్ విన్నాం కానీ, సినిమాకు కాన్వాయ్ ఏంటి అనుకుంటున్నారా.. ? అదే నాగి మ్యాజిక్.

 

కల్కి కాన్వాయ్ లో కొన్ని కార్లకు ఎల్ ఈడీ లు పెట్టి.. అందులో కల్కి పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ను చూపిస్తూ దేశం మొత్తం తిప్పుతున్నారు. అంటే ప్రేక్షకుల వద్దకు కల్కి వెళ్తుందన్నమాట. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ప్రమోషన్స్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఇదెక్కడి మాస్ ప్రమోషన్స్ రా మావా.. నెక్స్ట్ లెవెల్ అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కల్కితో ప్రభాస్ ఎలాంటి రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |