UPDATES  

NEWS

 తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త.. అసెంబ్లీ సీట్లు పెంపు,..

ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలకు తీపి కబురు చెప్పేసింది కేంద్రం. ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. 2029 ఎన్నికల నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఇరు రాష్ట్రాల అధికార పార్టీలో ఒకటే సందడి నెలకొంది.

 

దేశవ్యాప్తంగా లోక్‌సభ- రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు పెంపు

 

సోమవారం సాయంత్రం ఢిల్లీలో ఎన్డీయే సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎన్డీయే పార్టీలు హాజరయ్యాయి. కేంద్రమంత్రులు అమిత్‌షా, కిరణ్‌ రిజిజు, అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ల నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఈ క్రమంలో అసెంబ్లీ, లోక్‌సభ సీట్లు పెంపు విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని కేంద్రం డిసైడ్ అయ్యింది.

 

అంతేకాదు ఈ బిల్లు రానున్న పార్లమెంటు సమావేశాల్లో పెట్టడానికి తెరవెనుక పావులు కదుపుతోంది ఎన్డీయే సర్కార్. ఆ లెక్కన పార్లమెంటు స్థానాలు 543 నుంచి 816కి చేరుతాయని తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న 4,123 ఉన్న అసెంబ్లీ స్థానాలు ఇకపై 6,185 సీట్లు కానున్నాయి. ఏపీ పునర్విభన చట్టంలో నియోజకవర్గాల పెంపును ప్రధానంగా ప్రస్తావించింది కేంద్రం.

 

ఏపీలో 263 సీట్లు, తెలంగాణలో 179 స్థానాలు పెంపు

 

ఈ లెక్కన తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కు చేరుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో 175 ఎమ్మెల్యే స్థానాలు ఉండగా, అవి 263 స్థానాలకు చేరనున్నాయి. ఆ లెక్కన ఇరు రాష్ట్రాల్లో 50 శాతంపైగానే సీట్లు పెరిగాయి. అంతేకాదు లోక్‌సభ స్థానాలు ఏపీలో 25 నుంచి 38 పెరగనున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 17 ఎంపీలు 26 కి చేరనున్నాయి. ఆ లెక్కల ప్రకారం ఏపీలో 13, తెలంగాణలో 9 ఎంపీ సీట్లు పెరగనున్నాయి.

 

2011, 2027 జనాభా లెక్కన ఆధారంగా తీసుకుంటారా అనేదానిపై చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా జనగణన వచ్చే ఏడాది మార్చి ఒకటి నాటికి పూర్తి చేయనుంది. వాటి లెక్కలను ప్రకటించిన తర్వాత వెంటనే నియోజకవర్గాల పునర్విభజన చేపటవచ్చని కొందరు అధికారులు చెబుతున్నారు. దీనిపై అన్ని పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఎన్డీయే నిమగ్నమైంది.

 

2027 జనగణన ఆధారంగా సీట్ల పెంపునకు అనుమతిస్తే ఉత్తర-దక్షిణ భారతదేశాల మధ్య తేడా వచ్చే అవకాశం ఉంది. దీనిపై ఆది నుంచి దక్షిణాది రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు 50 శాతం పెంచాలని ఆలోచన చేసింది. దీనివల్ల రాష్ట్రాలకు ఎలాంటి సమస్య ఉందని ఎన్డీయే ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే ప్రతిపాదనపై కాంగ్రెస్ సహా మిత్రపక్షాలు ఏమంటాయో చూడాలి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |