లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీని విమర్శించడానికి అవకాశం లభించిన ప్రతీ సందర్భాన్ని వాడుకుంటున్నాయి.
కానీ సొంత పార్టీ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) ప్రత్యర్థి పార్టీ బీజేపీని ప్రశంసించడం కాంగ్రెస్ ను డిఫెన్స్ లో పడేసింది.
Tharoor praises Modi govt: ఉక్రెయిన్ వార్ విషయంలో భారత్ తీరు బావుంది..
కేరళ లోని తిరువనంతపురం లోక సభ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ (Shashi Tharoor) పంజాబ్ లోని లూథియానాలో జరగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతి ఎంటర్ ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేశ్ మిట్టల్ తో కలిసి ఫిక్కీ విమన్ (FICCIFLO) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన (Shashi Tharoor) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని (Modi govt) ప్రశంసించడం అందరినీ ఆశ్యర్యపరిచింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం (Ukraine war) విషయంలో భారత్ వైఖరి ప్రశంసనీయంగా ఉందని థరూర్ వ్యాఖ్యానించారు. యుక్రెయిన్ యుద్ధం (Ukraine war) నేపథ్యంలో, అటు అమెరికాతో, ఇటు రష్యాతో సమర్ధవంతంగా, బాలన్స్డ్ గా సంబంధాలు కొనసాగిస్తోందని భారత ప్రభుత్వాన్ని (Modi govt) శశి థరూర్ (Shashi Tharoor) ప్రశంసించారు.
Tharoor praises Modi govt: జీ 20 నిర్వహణ కూడా బావుంది..
ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ జీ 20 (G 20) అధ్యక్ష బాధ్యతలను కూడా భారత్ (Modi govt) సమర్ధవంతంగా నిర్వహిస్తోందని శశి థరూర్ (Shashi Tharoor) కొనియాడారు. దేశవ్యాప్తంగా 50 కి పైగా నగరాల్లో జీ 20 కార్యక్రమాలను సమర్దవంతంగా నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. ‘జీ 20 (G 20) నిర్వహణ లో ప్రభుత్వం (Modi govt) సమర్ధవంతంగా పని చేస్తోందని చెప్పి తీరాలి. 50కి పైగా నగరాల్లో ఈవెంట్స్ నిర్వహిస్తోంది. ఇప్పటికే జీ 20 దేశాల విదేశాంగ మంత్రుల సదస్సును, జీ 20 (G 20) దేశాల ఆర్థిక మంత్రుల సదస్సును విజయవంతంగా నిర్వహించింది” అని థరూర్ వ్యాఖ్యానించారు. తాజాగా థరూర్ (Shashi Tharoor) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారాయి.