ఇకపై 2వ తరగతి వరకు రాతపరీక్షలు ఉండకపోవచ్చు! ఈ మేరకు ఎన్సీఎఫ్ (నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్) ముసాయిదా సిఫార్సు చేసింది.
2వ తరగతి, అంత కన్నా తక్కువ వయస్సున్న పిల్లల తెలివిని అంచనా వేసేందుకు రాత పరీక్షలు నిర్వహించడం సరైన పద్ధతని కాదని పేర్కొంది. ‘అసెస్మెంట్’ పద్ధతులు.. పిల్లలపై అదనపు భారం వేసే విధంగా ఉండకూడదని స్పష్టం చేసింది. 3వ తరగతి నుంచి రాత పరీక్షలు మొదలుపెట్టొచ్చని సిఫార్సు చేసింది.
పిల్లలపై ఒత్తిడి తగ్గించేందుకు..!|
నేషనల్ ఎడ్జ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ)లో భాగంగా ఈ ముసాయిదాను రూపొందించారు. ఫండమెంటల్ స్టేజ్ (2వ తరగతి వరకు)లో ఉన్న విద్యార్థల అబ్జర్వేషన్లు, నేర్చుకున్న అంశాలపై వారి విశ్లేషణల ఆధారంగా అసెస్మెంట్ చేయాలని ముసాయిదా సూచిస్తోంది. అంతేకానీ.. పరీక్షలు నిర్వహించడం సరైనది కాదని స్పష్టం చేసింది.
National Curriculum Framework : “పిల్లలు చదువులో అసెస్మెంట్లు వైవిధ్యంగా ఉండాలి. ఒక్కో విద్యార్థి, ఒక్కో విధంగా నేర్చుకుంటాడు. ఒక్కో విధంగా అర్థం చేసుకుంటాడు. నేర్చుకున్న దానిని అసెస్ చేసేందుకు చాలా విధానాలు ఉండొచ్చు. వాటిని ఉపయోగించుకునే శక్తి టీచర్‌కు ఉండాలి. రికార్డింగ్, డాక్యుమెంటేషన్ రూపంలో అసెస్మెంట్ ఉండాలి. వీటిని ఎప్పటికప్పుడు రికార్డు చేసి, ఎనలైజ్ చేసి పిల్లల ప్రొగ్రెస్‌ను అంచనా వేయాలి. అదే సమయంలో ఈ అసెస్మెంట్లు పిల్లలపై అదనపు భారాన్ని మోపకూడదు. చదువులో భాగంగానే అసెస్మెంట్ చేస్తున్నట్టుగా ఉండాలి,” అని ఎన్సీఎఫ్ ముసాయిదా పేర్కొంది.
3వ తరగతిలో రాత పరీక్షలు ప్రారంభించాలని ఎన్సీఎఫ్ ముసాయిదా చెబుతోంది.
Class 2 written exams cancelled : “ప్రిపొరేటరీ స్టేజ్ (3-5 తరగతి)లో రాత పరీక్షలను ప్రవేశపెట్టాలి. చదువును ప్రమోట్ చేస్తున్నట్టుగా పరీక్షలు ఉండాలి. భారంగా ఉండకూడదు. విద్యార్థుల పనితనం బట్టి వారి ప్రొగ్రెస్‌ను చూడాలి. మిడిల్ స్కూల్ (6-8)లో సంభావిత అవగాహన (కాన్సెప్ట్యువల్ అండర్స్టాండింగ్)పై ఆధారపడి ఉండాలి. ఇక 9-12 (సెంకడరీ స్టేజ్) తరగతుల్లో చెప్పే చదువు ప్రాక్టికల్‌గా, అర్థవంతంగా, నిర్మాణాత్మక అభిప్రాయాలతో కలిగి ఉండాలి,” అని ముసాయిదా చెబుతోంది.
ఎన్‌సీఎఫ్‌ను ఇప్పటివరకు నాలుగు సార్లు (1975, 1988, 2000, 2005) సవరించారు. ఇది ఐదోసారి అవుతుంది. కొత్త ఎన్సీఎఫ్ ఆధారంగా రూపొందించిన పుస్తకాలు.. వచ్చే ఏడాది నుంచి ప్రవేశపెట్టనున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు.