UPDATES  

NEWS

 గుంటూరులో హైటెన్షన్: అంబటి రాంబాబు కారుపై దాడి.. తిరుమల లడ్డూ వివాదంపై రాజకీయ రచ్చ!

ఏపీలో తిరుమల లడ్డూ వివాదం మరోసారి రాజకీయ సెగలు రేపుతోంది. తిరుమల లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సిట్ (SIT) స్పష్టం చేసిందంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలతో గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో గుంటూరులోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ‘పాప ప్రక్షాళన’ పూజలు నిర్వహించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబును కూటమి నేతలు, కార్యకర్తలు అడ్డుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది.

అంబటి రాంబాబు ప్రయాణిస్తున్న కారుపై టీడీపీ మరియు కూటమి కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడికి దిగడం పెను దుమారానికి దారితీసింది. ఈ దాడిని అంబటి రాంబాబు తీవ్రంగా ఖండిస్తూ సీఎం చంద్రబాబు నాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. లడ్డూ విషయంలో గత ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు సిట్ నివేదిక తర్వాత ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన నిలదీశారు. అంబటి చేసిన ఈ వ్యాఖ్యలపై కూటమి నేతలు కూడా అదే స్థాయిలో విరుచుకుపడటంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం ముదిరింది.

ఈ ఘర్షణ నేపథ్యంలో గుంటూరులో హైటెన్షన్ వాతావరణం ఏర్పడటంతో పోలీసులు భారీగా రంగంలోకి దిగారు. ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. లడ్డూ వివాదం పుణ్యక్షేత్రం నుండి ఇప్పుడు వీధుల్లోకి చేరి రాజకీయ రణక్షేత్రంగా మారడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |